News January 8, 2026

IT కారిడార్‌లో అర్ధరాత్రి బేఫికర్!

image

ఆఫీసు నుంచి ఆలస్యంగా వచ్చే టెక్కీలైనా, రాత్రివేళ నడిచే సామాన్యులైనా చీకటి గల్లీల్లో అడుగు వేయాలంటే భయం. ఈ భయాన్ని పోగొట్టడానికే శేరిలింగంపల్లిలో రూ.50 కోట్లతో జీహెచ్‌ఎంసీ కొత్త వెలుగులు నింపుతోంది. కేవలం లైట్లు వేయడమే కాదు.. అవి ఐదేళ్ల పాటు వెలిగేలా గ్యారెంటీ బాధ్యత కూడా కాంట్రాక్టరుదేనని అధికారులు తెలిపారు. దీంతో మన రోడ్లపై రాత్రిపూట కూడా సురక్షితంగా, ధీమాగా తిరిగే భరోసా లభిస్తుంది.

Similar News

News January 31, 2026

HYD: బాలికపై అత్యాచారం.. 25 ఏళ్ల జైలు శిక్ష

image

బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడికి 25 ఏళ్ల శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇన్‌స్పెక్టర్ సైదులు వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ హబీబ్ (53) 2023లో బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో 25 సంవత్సరాలు జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు.

News January 31, 2026

సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన ముప్పు

image

సికింద్రాబాద్‌ మహంకాళి పీఎస్ పరిధి కళాసిగూడలో ఓ పాత భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. గదిలోని వస్తువులు దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న ప్రైవేట్ పాఠశాలకు ముప్పు తప్పింది. ప్రాణనష్టం జరగలేదు. దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

News January 31, 2026

HYD: GOOD NEWS.. రూ.5 వేల బహుమతి

image

రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేయడంలో భయపడవద్దని పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి వెంటనే సహాయం చేస్తే ‘గుడ్ సమారిటన్’ కేంద్ర ప్రభుత్వ పథకం కింద రూ.5,000 నగదు బహుమతి, పూర్తిగా చట్ట పరమైన రక్షణ ఉంటుందన్నారు. ఎలాంటి పోలీస్ కేసులు లేదా న్యాయ సమస్యలు ఉండవన్నారు. క్షతగాత్రులను ముందుగా సమీప ఆసుపత్రికి తరలించి, సాయం చేసి ప్రాణదాతలుగా నిలవాలన్నారు.