News October 11, 2025

AI వినియోగంపై ఐటీ కంపెనీల వేధింపులు

image

సిబ్బందిని కుదించేందుకు IT కంపెనీలు ఏఐ టూల్స్ వాడకాన్ని తప్పనిసరి చేస్తున్నాయి. అలా చేయని ఉద్యోగుల్ని వేధిస్తున్నాయని Redditలో పోస్టులు వైరల్‌గా మారాయి. ‘మా CEO 20 ఏఐ టూల్స్‌ సిద్ధంచేశారు. వాటిని వాడనందుకు సీనియర్‌ను వేధించారు. అసోసియేట్లను ఉంచి డెవలపర్లను తొలగిస్తామన్నారు’ అని ఓ ఉద్యోగి పేర్కొన్నారు. కాగా ఏఐతో అన్నీసాధ్యం కాదని, తమనూ ఇలాగే తొలగించి ఇపుడు మళ్లీ రమ్మంటున్నారని మరో నెటిజన్ అన్నాడు.

Similar News

News October 12, 2025

డ్రోన్ దాడుల్లో 60 మంది మృతి!

image

ఆఫ్రికా దేశం సూడాన్‌లో పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్సెస్ రెచ్చిపోయాయి. నార్త్ డార్ఫర్ సిటీలోని షెల్టర్‌పై జరిపిన డ్రోన్ దాడుల్లో 60 మంది వరకు మరణించారు. వీరిలో చిన్నారులు, మహిళలే సగానికి పైగా ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. 2023 నుంచి ఆర్మీతో పారామిలిటరీ ఘర్షణలు కొనసాగిస్తోంది. ఇందులో వేల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

News October 12, 2025

ప్రతి కుటుంబానికి మెరుగైన జీవనోపాధే లక్ష్యం: చంద్రబాబు

image

AP: ప్రతి కుటుంబానికి మెరుగైన ఆదాయం, జీవనోపాధి కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నామని CM CBN తెలిపారు. NLRలో స్మార్ట్ స్ట్రీట్‌ను వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు. ‘రూ.7కోట్లతో ఈ దుకాణాలను ఏర్పాటు చేశాం. ఇక్కడ దుకాణాలు పొంది 120మంది ఎంట్రప్రెన్యూర్‌లయ్యారు. మహిళలు, దివ్యాంగులు, వెనకబడిన వర్గాలకు వీటిని కేటాయించాం. ప్రతి ఇంటా చిరు వ్యాపారమో, చిరు పరిశ్రమనో స్థాపించేలా చూస్తున్నాం’ అని వివరించారు.

News October 11, 2025

నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు యాప్: CBN

image

AP: నకిలీ మద్యం గుర్తించడానికి త్వరలో యాప్ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎక్సైజ్‌శాఖపై సమీక్ష నిర్వహించారు. యాప్ ద్వారా మద్యం బాటిల్‌పై హోలోగ్రామ్ స్కాన్ చేస్తే మద్యం అసలైందో నకిలీదో తెలుస్తుందన్నారు. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ప్రోత్సహించి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిందని ఫైరయ్యారు. నకిలీ మద్యం వ్యవహారంలో TDP నేతలను సస్పెండ్ చేశామని తెలిపారు.