News May 10, 2024
అత్యధిక మహిళా ఉద్యోగులున్న ఐటీ కంపెనీలివే!

భారత్‌లోని ప్రధాన ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో అత్యధికంగా మహిళలు ఉన్న కంపెనీ ఏదో మీకు తెలుసా? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో 2.2 లక్షల మంది మహిళా ఉద్యోగులున్నారు. మొత్తం 6.1 లక్షల మంది ఉద్యోగులుంటే 36% మంది మహిళలుండటం విశేషం. దీనితర్వాత ఇన్ఫోసిస్‌లో 1.3 లక్షల మంది (39.4%), విప్రోలో 85,664 మంది, HCL TECHలో 66,197 మంది మహిళలు పనిచేస్తున్నారు.
Similar News
News February 2, 2026
జకోవిచ్.. ఆ టైటిల్ ఎప్పుడు నెగ్గుతాడో?

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 ఫైనల్‌లో వరల్డ్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓటమితో జకోవిచ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన 10సార్లూ జకోవిచ్ విజయం సాధించారు. నిన్న జరిగిన ఫైనల్లోనూ గెలిచి, 25వ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించాలన్న జకోవిచ్ ఆశలపై అల్కరాజ్ నీళ్లు చల్లారు. 2023 యూఎస్ ఓపెన్ తర్వాత ఈ సెర్బియా వీరుడు ఒక్క సింగిల్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌నూ గెలవలేదు.
News February 2, 2026
హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటుతో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు

కేంద్ర బడ్జెట్‌లో రైల్వేకు రూ.2.77 లక్షల కోట్లు కేటాయించడంపై సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యాల దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని పేర్కొన్నారు. రైల్వే, ప్రయాణికుల భద్రత కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఏడు హైస్పీడ్ కారిడార్ల అభివృద్ధి వల్ల రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
News February 2, 2026
ఇండియన్ నేవీలో 260 పోస్టులు

ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 260 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BE/BTech, MBA, BSc/B.Com/BSc(IT), MSc/MA, ME/MTech ఉత్తీర్ణతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అకడమిక్ మెరిట్, SSB ఇంటర్వ్యూ, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.1,25,000 చెల్లిస్తారు. అర్హులు FEB-24 వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://www.joinindiannavy.gov.in చూడండి.


