News May 23, 2024
అది మార్ఫింగ్ వీడియో కావొచ్చు: పిన్నెల్లి లాయర్

AP: పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మొదలైంది. నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదంటూ ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ‘ట్విటర్ వీడియో ఆధారంగా ఎలా అరెస్టు చేస్తారు? అది మార్ఫింగ్ వీడియో అయ్యే ఛాన్స్ కూడా ఉంది. గుర్తుతెలియని వ్యక్తులు EVM ధ్వంసం చేశారని పోలింగ్ ఆఫీసరే అన్నారు. FIRలో కూడా ఇదే ఉంది. అరెస్టుపై ఈసీ నేరుగా ఆదేశాలివ్వడం సరికాదు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 11, 2025
దేశంలో మహిళలే అసలైన మైనారిటీలు: SC

పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుపై SC కేంద్రానికి నోటీసులు జారీచేసింది. తాజా డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలుకు జయా ఠాకూర్ (CONG) దాఖలు చేసిన పిల్‌ను జస్టిస్‌లు నాగరత్న, మహదేవన్‌ల బెంచి విచారించింది. ‘పౌరులందరికీ సమానత్వం ఉండాలని రాజ్యాంగం చెబుతోంది. మహిళలు 48% ఉన్నా రాజకీయ సమానత్వంపై చర్చ నడుస్తోంది. అసలైన మైనారిటీలు వారే’ అని వ్యాఖ్యానించింది.
News November 11, 2025
ఢిల్లీ పేలుడు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎంలు

ఢిల్లీ పేలుడు ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ రాజధానిలో పేలుడు ఘటన షాక్‌కు గురిచేసిందని తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News November 11, 2025
జడేజా-శాంసన్ స్వాపింగ్ నిజమే!

IPLలో CSK, RR జట్ల మధ్య ట్రేడ్ టాక్స్ నిజమేనని Cricbuzz పేర్కొంది. ఓ ఫ్రాంచైజీ ఆఫీసర్ దీనిని ధ్రువీకరించినట్లు వెల్లడించింది. RR నుంచి శాంసన్ CSKకి, చెన్నై నుంచి రాజస్థాన్‌కు జడేజా, సామ్ కరన్ మారతారని తెలిపింది. ఇప్పటికే ఈ ముగ్గురు ప్లేయర్లు ఇందుకు అంగీకరించి సంతకాలు చేశారని వివరించింది. స్వాప్ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఇంకొంత సమయం పడుతుందని, త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని పేర్కొంది.


