News December 31, 2024

టాలెంట్ ఉన్నా, మెడల్స్ తెచ్చినా పట్టింపేలేదు!

image

ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున ఆడి 2 స్వర్ణాలు, 11 రజతాలు, 3 కాంస్యాలు సాధించిన పరాగ్ పాటిల్ ఇప్పుడు క్యాబ్ నడుపుకుంటున్నాడని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. దీనిపై ‘ఖేల్ ఇండియా’ స్పందించింది. ‘ఆయన ఒలింపిక్స్‌లో ఆడలేదు. కానీ సీనియర్ ఒలింపిక్స్(వెటరన్స్)లో మెడల్స్ సాధించారు. ఇంటర్నేషనల్ మెడల్స్ కూడా సాధించారు. IND నుంచి వెళ్లిన ప్రతిసారి మెడల్స్‌తో తిరిగొచ్చినా గుర్తింపు లభించలేదు’ అని పేర్కొంది.

Similar News

News November 7, 2025

మన హాకీకి వందేళ్లు.. పూర్వవైభవం సాధిద్దాం

image

స్వాతంత్య్రానికి ముందే భారత్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన క్రీడ హాకీ. 1925 NOV 7న మన హాకీకి IHF గుర్తింపు లభించింది. ఆ ఘనతకు నేటితో వందేళ్లు. 1926లో తొలి అంతర్జాతీయ పర్యటనకు న్యూజిలాండ్ వెళ్లిన భారత్ 21 మ్యాచుల్లో 18 గెలిచింది. 1958 వరకు వరుసగా ఆరు, 1964, 1980లో ఒలింపిక్స్ స్వర్ణాలు, 1975లో WC సాధించింది. ఆ తర్వాత హాకీ ప్రాభవాన్ని కోల్పోయింది. పదేళ్లుగా పూర్వవైభవం కోసం కృషి జరుగుతోంది.

News November 7, 2025

రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ రివ్యూ&రేటింగ్

image

టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో చిక్కుకుని దాన్నుంచి బయటపడలేక నలిగిపోయిన ఓ అమ్మాయి కథే ‘ది గర్ల్ ఫ్రెండ్’. పైకి నవ్వుతున్నట్లు కనిపించినా లోపల అంతులేని బాధను అనుభవించే పాత్రలో రష్మిక అదరగొట్టారు. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కథను చెప్పిన విధానం బాగుంది. సాంగ్స్, BGM ప్రధాన బలం. ఎమోషన్లకు పెద్దపీట వేయడంతో స్టోరీ స్లోగా సాగినట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో అనవసర సీన్లు, కథ ఊహించేలా ఉండటం మైనస్.
RATING: 2.75/5

News November 7, 2025

ఇతిహాసాలు క్విజ్ – 59

image

1. అర్జునుడి శంఖం పేరేంటి?
2. రుక్మిణి సోదరుడు ఎవరు?
3. అట్ల తద్ది పండుగ ఏ మాసంలో వస్తుంది?
4. సుమంత్రుడు ఎవరి రథసారథి?
5. తిరుపతిలో తలనీలాలు సమర్పించే స్థలాన్ని ఏమంటారు?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>