News March 10, 2025

రేవంత్‌కు మానవత్వం కూడా లేదని తేలిపోయింది: KTR

image

TG: CM రేవంత్ అసమర్థత వల్లే గురుకులాల్లో విద్యార్థుల మరణాలు చోటు చేసుకుంటున్నాయని KTR విమర్శించారు. ఇవి కాంగ్రెస్ సర్కారు చేసిన హత్యలేనని మండిపడ్డారు. ‘ఆదిలాబాద్(D) ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో లాలిత్య అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికరం. పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గం. రేవంత్‌కు మానవత్వం కూడా లేదని తేలిపోయింది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News April 11, 2026

మెకాన్‌ లిమిటెడ్‌లో 24 పోస్టులు

image

రెగ్యులర్‌ ప్రాతిపదికన 24 నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి మెకాన్‌ లిమిటెడ్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అకౌంటెంట్‌ 14, HR-02, అడ్మినిస్ట్రేషన్‌-02, సెక్రటేరియల్‌ సర్వీస్‌-06 పోస్టులున్నాయి. ICAI/ ICMAIలో ఇంటర్మీడియట్, BBA పూర్తి చేసి, 28 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు. రాత పరీక్షతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 6-5-26. మరిన్ని వివరాలకు meconlimited.co.in చూడండి.

News April 11, 2026

మగాళ్లకూ బ్రెస్ట్ క్యాన్సర్.. లక్షణాలివే!

image

రొమ్ము క్యాన్సర్ మహిళలకే కాకుండా పురుషులకూ అరుదుగా వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఇది కనిపిస్తుంది. చెస్ట్ వద్ద గడ్డలు, చర్మం రంగు మారడం, చనుమొనల నుంచి నీరు లాంటి ద్రవం లేదా రక్తం కారడం ప్రధాన లక్షణాలు. జన్యు కారణాలు, హార్మోన్ల అసమతుల్యత వల్ల ఇది రావచ్చు. లక్షణాలను ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే దీనిని నయం చేయవచ్చు’ అని HYD ESIC వైద్యులు సూచించారు.

News April 11, 2026

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.490 పెరిగి రూ.1,52,840కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.450 ఎగబాకి రూ.1,40,100 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.