News September 1, 2024

చంద్రబాబు తొలిసారి సీఎంగా ప్రమాణం చేసి నేటికి 29 ఏళ్లు

image

చంద్రబాబు 1995, సెప్టెంబర్ 1న తొలిసారి ఏపీ సీఎంగా ప్రమాణం చేశారు. ఆ సందర్భానికి నేటితో 29 ఏళ్లు పూర్తయ్యాయి. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఆయన అందుకున్నారు. 28 ఏళ్లకు ఎమ్మెల్యే, 30 ఏళ్లకు మంత్రి, 45 ఏళ్ల వయసులో సీఎం అయ్యారు. ప్రస్తుతం 74 ఏళ్ల వయసులో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Similar News

News January 29, 2026

ఒకే రోజు రూ.25వేలు పెరిగిన కేజీ సిల్వర్ ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ సిల్వర్ రేటు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.25వేలు పెరిగి రూ.4,25,000కు చేరింది. కేవలం 3 రోజుల్లోనే రూ.50వేలు పెరిగి ఇన్వెస్టర్లకు భారీ లాభాన్నిచ్చింది. ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో సిల్వర్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడమే ఈ పెరుగుదలకు కారణం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

News January 29, 2026

నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని CBI తేల్చింది: YCP

image

AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై CBN చేసిన దుష్ప్రచారం బెడిసికొట్టిందని YCP విమర్శించింది. లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని CBI తేల్చినట్లు వివరించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారంతో కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను CBN దెబ్బతీశారని పేర్కొంది. ‘నిజం బయటపడింది.. మీలో ఏమాత్రం నిజాయతీ ఉన్నా లెంపలేసుకుని భక్తులకు క్షమాపణలు చెప్పు CBN’ అని ట్వీట్ చేసింది.

News January 29, 2026

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.11,770 పెరిగి రూ.1,78,850కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.10,800 ఎగబాకి రూ.1,63,950 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.