News September 26, 2024
దేశంలో అత్యధిక నిరుద్యోగిత రేటు ఇక్కడే

దేశంలోనే లక్షద్వీప్‌లో అత్యధిక నిరుద్యోగిత రేటు ఉంది. ఇక్కడ 36.2 శాతం నిరుద్యోగిత నెలకొంది. ఆ తర్వాత అండమాన్ నికోబార్ దీవులు (33.6), కేరళ (29.9), నాగాలాండ్ (27.4). మణిపుర్ (22.9), లద్దాఖ్ (22.2), అరుణాచల్ ప్రదేశ్ (20.9), ఏపీ (17.5) ఉన్నాయి. అలాగే దేశంలోనే అత్యల్ప నిరుద్యోగిత రేటు మధ్యప్రదేశ్ (2.6) లో ఉంది. ఆ తర్వాత గుజరాత్ (3.1), ఝార్ఖండ్ (3.6), ఢిల్లీ (4.6), చండీగఢ్ (6.3) ఉంది.
Similar News
News November 7, 2025
జూబ్లీ ఉపఎన్నిక.. రూ.3.33 కోట్ల నగదు సీజ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.3.33 కోట్లు నగదు, 701 లీటర్ల మద్యం, ల్యాప్‌టాప్‌లు, వాహనాలు వంటి ఉచిత బహుమతులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 7వ తేదీ ఉదయం వరకు మొత్తం 24 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి. స్వేచ్ఛా యుతంగా, న్యాయంగా ఎన్నికలు జరగేందుకు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కఠిన నిఘా కొనసాగిస్తున్నాయి.
News November 7, 2025
చర్చలు సఫలం.. రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. రూ.900 కోట్ల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా కాలేజీలు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే.
News November 7, 2025
PHOTO: రాజ్ నిడిమోరుతో సమంత

డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ ప్రచారం వేళ ఇన్‌స్టాలో సమంత ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఓ ఈవెంట్ సందర్భంగా దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఇందులో సామ్, రాజ్ క్లోజ్‌గా ఉన్న ఫొటో కూడా ఉంది. గత ఏడాదిన్నరగా తన జీవితంలో కొన్ని బోల్డ్ డెసిషన్లు తీసుకున్నానని, అందుకు కృతజ్ఞతగా ఉన్నట్లు ఆమె రాసుకొచ్చారు. దీంతో రాజ్‌తో తన బంధాన్ని ఆమె బహిరంగంగానే ప్రకటించారని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.


