News October 13, 2024

ఆ విషయం ఎంతో బాధించింది: నిఖత్

image

తన పంచ్ పవర్ మెరుగుపర్చుకునేందుకు కోచ్ కోసం వెతుకుతున్నానని స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ తెలిపారు. ‘మంచి కోచ్ దొరికితే లోపాలను సరిదిద్దుకుంటా. నేను అన్‌సీడెడ్ ప్లేయర్ కావడంతో పారిస్ ఒలింపిక్స్‌లో ఆరంభంలోనే క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురయ్యారు. ఆరోజు నాకు కలిసి రాలేదు. ఈ ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన వాళ్లను నేను గతంలో ఓడించా. అది తలుచుకుంటేనే బాధేస్తుంది. కానీ ఎలా పుంజుకోవాలో నాకు తెలుసు’ అని అన్నారు.

Similar News

News November 7, 2025

చర్చలు సఫలం.. రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్

image

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. రూ.900 కోట్ల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా కాలేజీలు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే.

News November 7, 2025

PHOTO: రాజ్ నిడిమోరుతో సమంత

image

డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ ప్రచారం వేళ ఇన్‌స్టాలో సమంత ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఓ ఈవెంట్ సందర్భంగా దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఇందులో సామ్, రాజ్ క్లోజ్‌గా ఉన్న ఫొటో కూడా ఉంది. గత ఏడాదిన్నరగా తన జీవితంలో కొన్ని బోల్డ్ డెసిషన్‌లు తీసుకున్నానని, అందుకు కృతజ్ఞతగా ఉన్నట్లు ఆమె రాసుకొచ్చారు. దీంతో రాజ్‌తో తన బంధాన్ని ఆమె బహిరంగంగానే ప్రకటించారని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

News November 7, 2025

₹67 లక్షల లోన్ తీర్చేసిన టెకీ.. అతడిచ్చే సూచనలివే!

image

6 ఏళ్లలో ₹67 లక్షల హోమ్ లోన్ తీర్చడంలో నేర్చుకున్న పాఠాలను చెబుతూ టెకీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘2019లో తీసుకున్న ₹53L లోన్‌ను ₹14L వడ్డీతో ఈ నెలలో కట్టేశా. సొంతిల్లు అంటే తొలుత ఎమోషనల్‌గా ఉన్నా తర్వాత సమస్యలొస్తాయి. మానసిక ఒత్తిడి వస్తుంది. రీపేమెంట్‌ ప్లాన్ ఉండాలి. ఇంటి విలువ పెరిగినా లిక్విడిటీ ఉండదు. లోన్ వల్ల కష్టపడి పనిచేస్తాం. ఆర్థిక క్రమశిక్షణ వస్తుంది’ అని redditలో పేర్కొన్నాడు.