News January 7, 2025

అది లొట్టపీసు కేసు: KTR

image

TG: తనపై పెట్టిన కేసులో ఏమీ లేదని, అదో లొట్టపీసు కేసు అని KTR మరోసారి ఆరోపించారు. అవినీతిలో పట్టుబడిన వారికి ప్రతీది అవినీతిలానే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. అవినీతి లేదని తెలిసీ తనపై కేసు పెట్టి కాంగ్రెస్ నేతలు శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగపరంగా తనకున్న హక్కు ప్రకారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశానన్నారు. అటు లాయర్లతో ACB విచారణకు వెళ్లేలా అనుమతించాలని రేపు HCకి వెళ్తానన్నారు.

Similar News

News January 12, 2025

రిపబ్లిక్ డే పరేడ్‌కు రాష్ట్రం నుంచి 41 మంది

image

TG: న్యూఢిల్లీలోని కర్తవ్య్‌పథ్‌లో నిర్వహించే గణతంత్ర వేడుకలకు 41 మంది రాష్ట్ర వాసులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వీరిలో సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులతో పాటు ప్రత్యేక విభాగాలకు చెందిన వారు ఉన్నారు. ఈ పరేడ్ స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా రాజేశ్వర్ ఉండనుండగా ట్రెయినీ డీజీటీ శ్రావ్యతో పాటు మన్ కీ బాత్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న 15 మంది అభ్యర్థులు ఉన్నారు.

News January 12, 2025

నేడు మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మరణించిన ఆరుగురి కుటుంబాలకు నేడు టీటీడీ చెక్కులు పంపిణీ చేయనుంది. ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలోని బృందాలు వైజాగ్, నర్సీపట్నం, తమిళనాడు, కేరళలోని మృతుల కుటుంబాల ఇంటికి వెళ్లనున్నాయి. వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున చెక్కు ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం, ఉచిత విద్యను అందించేందుకు వివరాలు సేకరించనున్నాయి.

News January 12, 2025

యువతకు స్ఫూర్తి ప్రదాత.. వివేకానంద

image

భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి చాటిన తత్వవేత్త స్వామి వివేకానంద. దేశ సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తి చేయడంలో ఆయన నిరంతరం కృషి చేశారు. 1893లో చికాగోలో హిందుత్వాన్ని పరిచయం చేస్తూ చేసిన ప్రసంగంతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. యువతే దేశ అభివృద్ధికి పునాదులు అంటూ నిరంతరం ప్రోత్సహించేవారు. ఆయనకు గౌరవ సూచకంగా వివేకానంద జయంతి(JAN 12)ని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం.