News May 12, 2024
పోలింగ్ బూత్‌లో ఇలా చేస్తే నేరం..

➦ బూత్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.. ఎలాంటి ప్రచారాలు, అల్లర్లు సృష్టించకూడదు ➦ ఎన్నికల అధికారి విధులకు ఆటంకం కలిగించడం ➦ పరికరాలను ధ్వంసం చేయడం ➦ ఓటు వేసేటప్పుడు ఫొటోలు తీయడం.. ఏ పార్టీకి ఓటు వేశారో బయటపెట్టడం ➦ ఎవరైనా ఓటు వేస్తున్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీయడం ➦ దొంగ ఓట్లు వేయడం ➦ ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే ఒక ఓటు మాత్రమే వినియోగించాలి.
Similar News
News October 14, 2025
మామిడి రైతులకు డబ్బులు విడుదల

AP: తోతాపురి మామిడి విక్రయించిన రైతులకు ప్రభుత్వం నగదు విడుదల చేసింది. 40,795 మంది రైతుల ఖాతాల్లో రూ.185.02 కోట్ల సబ్సిడీని జమ చేసింది. ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకూ ఎక్స్‌గ్రేషియా నిధులు రిలీజ్ చేసింది. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 19 జిల్లాల్లో 106 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.5.30కోట్లు జమ చేసింది.
* రోజూ అగ్రికల్చర్ వార్తల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి..
News October 14, 2025
పూజకు పూలు లేనప్పుడు ఏం చేయాలి?

పూజ సమయంలో పూలు లేకపోతే చాలామంది వాటి బదులు అక్షింతలు కలిపి పూజ చేస్తుంటారు. అయితే పూలను అక్షింతలతో కలిపి పూజించవద్దని పండితులు చెబుతున్నారు. దీనివల్ల విఘ్నాలు వస్తాయని అంటున్నారు. ఒకవేళ ఇంట్లో ఒకటి, రెండు పూలు మాత్రమే ఉంటే.. వాటిని ముందు దేవుడి పాదాల వద్ద ఉంచి, ఆ తర్వాత అక్షింతలను సమర్పించాలి. పూలు లేనప్పుడు కేవలం అక్షింతలతో పూజ చేసినా శుభ ఫలితం దక్కుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి. <<-se>>#POOJA<<>>
News October 14, 2025
NABARDలో ఉద్యోగాలు

నాబార్డ్ 6 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ( BCA, IT), ME, M.TECH, MCA, MBA, CA, PGDM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150. వెబ్‌సైట్: https://www.nabard.org/