News June 5, 2024
అది జగన్ పెత్తందారీతనానికి నిదర్శనం: నిమ్మల
AP: తాజా ఎన్నికల ఫలితాలతో YCP నియంతృత్వ పాలనను ప్రజలు అథ:పాతాళానికి తొక్కేశారని.. TDP నేత MLA నిమ్మల రామానాయుడు అన్నారు. తాను చేసిన సంక్షేమాన్ని పక్కనపెట్టి, ప్రజలు తనను మోసం చేశారంటూ మాజీ సీఎం జగన్ చెప్పడం ఆయన పెత్తందారీతనానికి నిదర్శనమని విమర్శించారు. తన చేతగానితనాన్ని ప్రజల మీదకు నెట్టేసిన ఏకైక CM జగన్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. AP ఎన్నికల ఫలితాలు 5 కోట్ల ఆంధ్రుల సమష్టి విజయమని వ్యాఖ్యానించారు.
Similar News
News November 28, 2024
ఒక టూరిస్టులాగా ఫొటో తీసుకున్నా: ఆర్జీవీ
AP: గతేడాది చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు జైలు ఎదుట ఆర్జీవీ సెల్ఫీ తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ఆయన దానిపై స్పందించారు. ‘చంద్రబాబు జైల్లో ఉన్నాడని అందరికీ తెలుసు. ఒక టూరిస్టులాగా ఫొటో తీసుకున్నా. ఆ స్థానంలో గాంధీ, హిట్లర్, జగన్ ఉన్నా నేను అలానే చేసేవాణ్ని. దాంట్లో రెచ్చగొట్టడం, హేళన చేయడం ఏముంది?’ అని ఓ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.
News November 28, 2024
తమిళనాడులో ఫాక్స్కాన్ భారీ పెట్టుబడి!
తమిళనాడు మరో భారీ ప్రాజెక్టును దాదాపుగా సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫాక్స్కాన్ కంపెనీ ప్రపంచంలో రెండో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సెంటర్ (BESS)ను తమిళనాడులో నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వం చెన్నైకి 50 కి.మీ దూరంలో 200 ఎకరాలను ఆఫర్ చేసినట్లు సమాచారం. దాంతో పాటు ఇన్సెంటివ్ ప్యాకేజీ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
News November 28, 2024
10 రోజుల ముందుగానే ‘అయోధ్య’ వార్షికోత్సవం.. కారణమిదే
యూపీలోని అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 11వ తేదీనే రామాలయ వార్షికోత్సవాలు నిర్వహించేందుకు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరగగా, 10 రోజుల ముందుగానే వార్షికోత్సవం నిర్వహించడానికి ఓ కారణం ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్య శుక్ల ద్వాదశి(కూర్మ ద్వాదశి) నాడు వేడుక నిర్వహించాలి. 2025లో ఈ తిథి జనవరి 11నే రావడంతో ఆ రోజే వేడుకలు జరగనున్నాయి.