News August 14, 2025
అది మన చరిత్రలో విషాదకర అధ్యాయం: మోదీ

1947లో భారత్, పాక్ విభజన సందర్భంగా జరిగిన విధ్వంసంపై PM మోదీ ట్వీట్ చేశారు. ‘మన చరిత్రలోనే విషాదకర అధ్యాయమైన విభజన సమయంలో అసంఖ్యాక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఊహకందని నష్టాన్ని ఎదుర్కొన్నారు. వారి ధైర్య సాహసాలను గౌరవించుకోవాల్సిన రోజు ఇది. దేశాన్ని ఐక్యంగా, సామరస్యంగా ఉంచడం మన బాధ్యత అని ఈ రోజు గుర్తు చేస్తోంది’ అని వ్యాఖ్యానించారు. #PartitionHorrorsRemembranceDay హ్యాష్‌ట్యాగ్‌ను షేర్ చేశారు.
Similar News
News August 14, 2025
NTR, హృతిక్ ‘వార్-2’ రివ్యూ & రేటింగ్

శత్రువులుగా మారిన మిత్రులు విక్రమ్(NTR), కబీర్(హృతిక్) దేశం కోసం ఒక్కటై విదేశీ కుట్రను ఎలా తిప్పికొట్టారనేదే ‘వార్-2’ స్టోరీ. NTR, హృతిక్ స్క్రీన్ ప్రజెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, యాక్షన్, క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి. వార్-1 ఇంట్రో లేకపోవడం, ఊహించే సీన్లు, కొన్నిచోట్ల డబ్బింగ్ సమస్య, పూర్ VFX మైనస్. స్పై యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారికే నచ్చుతుంది.
Way2News రేటింగ్-2.5/5
News August 14, 2025
స్టార్ ప్లేయర్ తండ్రి కన్నుమూత

ప్రముఖ టెన్నీస్ దిగ్గజం లియాండర్ పేస్ తండ్రి వెసీ పేస్(80) కన్నుమూశారు. అనారోగ్యంతో రెండ్రోజుల క్రితం కోల్‌కతాలోని ఆస్పత్రిలోని చేరిన ఆయన చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. వెసీ పేస్ 1972లో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టులో సభ్యుడు.
News August 14, 2025
ICET కౌన్సెలింగ్ ఎప్పుడంటే?

TG: MBA, MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. తొలి విడతలో భాగంగా AUG 20న కౌన్సెలింగ్ ప్రారంభమై సెప్టెంబర్ 5తో ముగియనుంది. ఈ నెల 20-28 వరకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్, 22-29 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 25-30 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. SEP 2లోపు సీట్లు కేటాయిస్తారు. రెండో విడత సెప్టెంబర్ 8న ప్రారంభమై, 16తో ముగుస్తుంది.