News August 28, 2024
స్కూళ్లు మూతపడటం సిగ్గుచేటు: హరీశ్ రావు

TG: CM రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో టీచర్లు లేక స్కూళ్లు మూతపడటం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ’15 రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూలు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పి, ఇప్పుడు స్కూళ్లు మూతపడేలా చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? విద్యా వాలంటీర్లను నియమించి స్కూళ్లు మూతపడకుండా చూడాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News October 16, 2025
BREAKING: ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు సమర్థించింది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసింది.
News October 16, 2025
బీసీ రిజర్వేషన్లు 50% దాటొచ్చనే తీర్పు లేదు: ప్రతివాదుల లాయర్

TG: బీసీ రిజర్వేషన్లపై ప్రతివాదుల తరఫున సీనియర్ లాయర్ గోపాల్ శంకర్నారాయణన్ వాదనలు వినిపిస్తున్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాలు కలిగిన రాష్ట్రాల్లోనే రిజర్వేషన్ల పరిమితి 50% దాటిందన్నారు. అక్కడ SC, STలకే రిజర్వేషన్లు వర్తించాయని, BCల కోసం 50% పరిమితి దాటొచ్చనే తీర్పు లేదని వాదించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో 50% పరిమితి దాటకుండా ఎన్నికలు నిర్వహించాలని గతంలో SC తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.
News October 16, 2025
కొండా సురేఖ రాజీనామా చేస్తారా?

TG: రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. <<18018400>>వివాదం<<>> నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ అధిష్ఠానం కూడా రిజైన్ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. HNKలోని ఆమె ఇంటి వద్ద సెక్యూరిటీ, పోలీస్ ఔట్ పోస్టును తొలగించడం వీటికి బలం చేకూరుస్తున్నాయి. అటు సురేఖ BC నేత కావడంతో అధిష్ఠానం అంత ఈజీగా పదవి నుంచి తొలగిస్తుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.