News August 15, 2024
నెహ్రూ వల్లే దేశం ఈ స్థాయిలో ఉంది: రేవంత్

నెహ్రూ దార్శనికత ఫలితంగానే దేశం ఈ స్థాయిలో ఉందని స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా CM రేవంత్ అన్నారు. ‘ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులను మనం ఇప్పుడు ఆధునిక దేవాలయాలుగా చెప్పుకుంటున్నాం. వాటి వల్ల దేశం సస్యశ్యామలంగా ఉంది. BHEL, IDPL, మిధాని వంటి పరిశ్రమలను నెహ్రూ స్థాపించి దేశ ఆర్థికాభివృద్ధికి పునాదులు వేశారు. లాల్బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వ్యవసాయంలో నూతన విప్లవాలు తెచ్చారు’ అని CM కొనియాడారు.
Similar News
News November 26, 2025
IPL ఆధారంగా టెస్టులకు సెలక్ట్ చేస్తే..

టీమ్ ఇండియా బ్యాటర్లు టెస్టుల్లో విఫలం అవడానికి ప్రధాన కారణం IPL ఆధారంగా సెలక్ట్ చేయడమేనని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దూకుడుగా ఆడే బ్యాటర్లను వన్డేలు, టీ20లకు ఎంపిక చేయాలి కానీ టెస్టులకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్, ఇంద్రజిత్, యశ్ రాథోడ్, పృథ్వీ షా, జగదీశన్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి డొమెస్టిక్ ప్లేయర్లను తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు.
News November 26, 2025
మహదేవపూర్: SI అత్యుత్సాహం.. మహిళ ఆత్మహత్యాయత్నం?

SI ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మహదేవ్పూర్(M)లో జరిగింది. బాధితురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. సూరారానికి చెందిన మహేశ్ రెడ్డి, శైలజ భార్యాభర్తలు. లక్ష్మారెడ్డి అనే ఓ వ్యక్తికి వీరు అప్పు ఇవ్వగా, తిరిగి డబ్బు తీసుకునే విషయంలో SI ఇన్వాల్వ్ అయ్యి వారిని ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలో ఇంట్లోకి SI చొరబడి తన భార్యను బెదిరింపులకు గురిచేయడంతో పురుగు మందు తాగింది.