News April 21, 2024

బాంబుల నుంచి గులకరాయికి రావడం మంచిదే: నారాయణ

image

AP: సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి ఘటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు వేశారు. ‘బాంబు దాడుల నుంచి గులకరాయికి రావడం మంచిదే. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాళ్లకు కట్టుతో తిరిగారు. ఇక్కడ సీఎం జగన్ తలకు కట్టుకున్నారు. ప్రజలకు గులకరాయి కథలు తెలుసు. ఇప్పుడు మరణవార్త అని చెప్పినా ఎవరూ నమ్మబోరు. రాయి వేసిన వారిని కాకుండా పోలీసులు మరొకరిని ఇరికించాలని చూస్తున్నారు’ అని విమర్శించారు.

Similar News

News March 27, 2026

వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్

image

వాట్సాప్ సూపర్ ఫీచర్‌ను ప్రకటించింది. వ్యక్తిగత, గ్రూప్ చాట్స్(ఫొటోలు, వీడియోలు సహా), కాల్ హిస్టరీ, కమ్యూనిటీస్, వాట్సాప్ ఛానల్ అప్డేట్స్‌ను మరో ప్లాట్‌ఫామ్‌లోకి మార్చుకొనే వీలు కల్పించింది. అంటే మరో వాట్సాప్‌/ఇతర మెసేజింగ్ యాప్స్‌కు సమాచారాన్ని బదిలీ చేసుకోవచ్చు. దీనివల్ల స్టోరేజీ ఇబ్బంది ఉండదు. ఇకపై ఐఫోన్‌లోనూ 2 అకౌంట్లు వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ మధ్య చాట్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

News March 27, 2026

పెళ్లిపై స్పందించిన సాయి పల్లవి

image

తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు హీరోయిన్ సాయి పల్లవి ఫుల్ స్టాప్ పెట్టారు. ఓ ప్రోగ్రామ్‌లో జర్నలిస్టులు పెళ్లి గురించి అడగ్గా ఆమె స్పందించారు. ‘ప్రస్తుతం నా పూర్తి దృష్టి కెరీర్‌పైనే ఉంది. పెళ్లి గురించి ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదు. నేను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నా’ అని చెప్పారు. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘ఏక్ దిన్’ అనే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు.

News March 27, 2026

అలా అయితే ధోనీ IPL ఆడొద్దు: అశ్విన్

image

IPL-2026లో CSK లెజెండ్ ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడొద్దని మాజీ క్రికెటర్ అశ్విన్ అన్నారు. ‘ధోనీ ప్లేయింగ్-11లోనే ఉండాలి. 3 నెలల నుంచి ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆడగలననే నమ్మకం ఉంది కాబట్టే అలా చేశారు. ఒకవేళ తుది జట్టులో లేకపోతే టోర్నీ మొత్తానికే ఆడకూడదు. ఫీల్డ్‌లో ఉంటే కెప్టెన్ రుతురాజ్‌కు సపోర్ట్ ఇస్తారు. ఒకవేళ ధోనీకి ఆడాలని లేకపోతే రిటైర్ అవుతారు’ అని అభిప్రాయపడ్డారు.