News May 10, 2024

దేశాన్ని విభజించి పాలించాలనేది కాంగ్రెస్ కుట్ర: మోదీ

image

భారతీయుల పట్ల కాంగ్రెస్ నేతలు జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘కాంగ్రెస్ రాకుమారుడి గురువు మనల్ని ఆఫ్రికన్లు అని మాట్లాడారు. దేశాన్ని విభజించి పాలించాలనేది కాంగ్రెస్ కుట్ర. శ్రీరామనవమి జరుపుకోవడం కూడా తప్పే అన్నట్లు వారు మాట్లాడుతున్నారు. రాముడిని పూజించడం దేశద్రోహమా? బుద్ధం శరణం గచ్చామి ఇండియా సిద్ధాంతం. అహింసో పరమోధర్మో అనేది భారత్ సిద్ధాంతం’ అని స్పష్టం చేశారు.

Similar News

News December 26, 2024

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ కన్నుమూత

image

భారత మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్(92) క‌న్నుమూశారు. ఇవాళ సాయంత్రం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ ఎమ‌ర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారు. అయితే కొద్దిసేప‌టికే మన్మోహన్ తుది శ్వాస విడిచినట్టు వారు ప్రకటించారు.

News December 26, 2024

రైతు భరోసాపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

image

TG: కుటుంబంలో ఎంత మంది పేర్ల మీద భూమి ఉన్నా ఏడెకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో వరుసగా రెండేళ్లు ఫ్యామిలీలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తే భరోసా వర్తించదని తెలుస్తోంది. ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేసిన భూమికే లబ్ధి చేకూర్చనుంది. పంటలు సాగు చేశారో లేదో తెలుసుకునేందుకు శాటిలైట్ సర్వే నిర్వహించనుంది. ఈ మేరకు మార్గదర్శకాల రూపకల్పన దాదాపు పూర్తయింది.

News December 26, 2024

రేపు వైసీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళన

image

AP: విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా రేపు వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద ర్యాలీలు నిర్వహిస్తారు. విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలను కలుపుకుని వైసీపీ ఈ కార్యక్రమం చేపట్టనుంది.