News April 5, 2024

భార్య నిత్యం అత్తారింటిని వదలడం క్రూరత్వమే: హైకోర్టు

image

భర్త తప్పు లేకున్నా భార్య చీటికిమాటికీ అత్తారింటిని వదిలి వెళ్లడం మానసిక క్రూరత్వమేనని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. పరస్పర సహకారం, విధేయత ఉన్నప్పుడే వివాహ బంధం కలకాలం నిలబడుతుందని పేర్కొంది. 19 ఏళ్ల కాలంలో 7 సార్లు భార్య తనను విడిచిపెట్టిందని, వెళ్లిన ప్రతిసారీ 3 నుంచి 10 నెలలు వచ్చేది కాదని భర్త తెలిపారు. వాదనలు విన్న కోర్టు.. భర్త విడాకులు తీసుకోవడం సబబేనని స్పష్టం చేసింది.

Similar News

News October 8, 2024

జమ్మూకశ్మీర్‌లో ఈ ఎన్నికలు ప్రత్యేకం: మోదీ

image

JKలో ఆర్టిక‌ల్ 370, 35(A) ర‌ద్దు త‌రువాత మొద‌టిసారిగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌లు ఎంతో ప్ర‌త్యేకం అని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. భారీగా న‌మోదైన ఓటింగ్‌ ప్ర‌జాస్వామ్యంపై ప్ర‌జ‌ల విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శించింద‌న్నారు. పార్టీ ప‌నితీరుపై హ‌ర్షం వ్య‌క్తం చేసిన మోదీ ఓటువేసిన వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. JK ప్ర‌జ‌ల సంక్షేమం కోసం నిరంత‌రం ప‌ని చేస్తామ‌న్నారు. మెరుగైన ఫ‌లితాలు సాధించిన NCని అభినందించారు.

News October 8, 2024

BIG BREAKING: బీజేపీ సంచలన విజయం

image

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హరియాణాలో బీజేపీ సంచలన విజయం సాధించింది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టింది. తొలుత కాంగ్రెస్ భారీ ఆధిక్యంలో దూసుకెళ్లినా క్రమంగా కమలం రేసులోకి వచ్చింది. ఇక అప్పటినుంచి వరుసగా సీట్లు గెలుస్తూ మ్యాజిక్ ఫిగర్ (46) దాటింది. EC లెక్కల ప్రకారం 90 సీట్లకు గాను BJP 46, కాంగ్రెస్ 35 చోట్ల గెలిచాయి. చెరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

News October 8, 2024

బీజేపీని గెలిపించిన 200 రోజుల ముఖ్య‌మంత్రి

image

ఎన్నిక‌ల‌కు 200 రోజుల ముందు హరియాణా CMగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాయ‌బ్ సింగ్ సైనీ BJPని అనూహ్యంగా విజ‌య‌తీరాల‌కు చేర్చారు. డ‌మ్మీ CM అని ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా BJP ఎన్నిక‌ల ప్ర‌చారం మొత్తం ఆయ‌న చుట్టూనే తిరిగింది. ఫ‌లితాల‌పై ముందుగానే బాధ్య‌త వ‌హించిన సైనీ ప్రభుత్వ వ్యతిరేకతలోనూ పార్టీని ముందుండి నడిపారు. అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హ్యాట్రిక్ విజయానికి కార‌ణ‌మ‌య్యారు.