News August 7, 2024

హసీనా లండ‌న్ వెళ్ల‌డం క‌ష్ట‌మే!

image

లండన్ వెళ్లి రాజ‌కీయ ఆశ్ర‌యం పొందాలని యోచిస్తోన్న బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనాకు ప‌రిస్థితులు అనుకూలంగా లేవు. బంగ్లాలో చెలరేగిన అల్ల‌ర్లపై విచార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉండ‌డంతో ఆమెను స్వ‌దేశానికి అప్ప‌గించ‌కుండా ర‌క్ష‌ణ‌ క‌ల్పించ‌లేమ‌న్న‌ భావ‌న‌లో బ్రిట‌న్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. పైగా దీనిపై ఐరాస సార‌థ్యంలో స్వ‌తంత్ర దర్యాప్తు జ‌ర‌పాల‌ని బ్రిట‌న్ కోర‌డం గ‌మ‌నార్హం.

Similar News

News December 4, 2025

ఆదిలాబాద్‌కు ఎయిర్‌‌బస్ తెస్తాం: CM రేవంత్

image

TG: అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని CM రేవంత్ పేర్కొన్నారు. ‘ఆదిలాబాద్‌కూ ఎయిర్‌పోర్టు కావాలని MLA పాయల్ శంకర్ నాతో అన్నారు. ఇదే విషయం నిన్న ఢిల్లీలో PM మోదీతో మాట్లాడాను. సంవత్సరం తిరిగేలోగా ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభిస్తాం. ఎర్రబస్సు రావడమే కష్టమనుకున్న ప్రాంతంలో ఎయిర్‌బస్ తీసుకొచ్చి.. కంపెనీలు నెలకొల్పే బాధ్యత తీసుకుంటున్నా’ అని తెలిపారు.

News December 4, 2025

డెస్క్ వర్క్ చేసే వాళ్లకి ఫ్రోజెన్ షోల్డర్ ముప్పు

image

నేడు చాలా మందిని వేధిస్తున్న సమస్య ఫ్రోజెన్ షోల్డర్. చేతిని పైకి ఎత్తినా, కాస్త వేగంగా కదిలించినా నొప్పి వస్తుంది. పడిపోవడం, దెబ్బ తగలడం లేదా ఎక్సర్‌సైజులు చేయడం వల్ల అలా జరిగిందని అనుకుంటారు. డెస్క్‌లో కూర్చుని పనిచేసే వాళ్లకు ఫ్రోజెన్ షోల్డర్ ముప్పు ఎక్కువని సర్వేలో తేలింది. డయాబెటిస్, హైపోథైరాయిడిజం, గుండె జబ్బుల బాధితులకు ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఎక్కువ. దీనిని అథెసివ్ క్యాప్సులైటిస్ అంటారు.

News December 4, 2025

ఇవాళ మిస్ అయితే మళ్లీ 2042లోనే!

image

ఈ ఏడాది ఆఖరి సూపర్ మూన్ మరికొద్దిసేపట్లో ఆవిష్కృతం కానుంది. ఈ రోజు కనిపించే చంద్రుడు 2042 వరకు మళ్లీ ఇంత దగ్గరగా, ఇంత పెద్దగా కనిపించడని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. చందమామ భూమికి అత్యంత <<18450358>>సమీప<<>> పాయింట్‌కు రావడం వల్ల ఇది ‘లార్జెస్ట్ మూన్’గా దర్శనమివ్వనుంది. ఈ అరుదైన ప్రకాశవంతమైన చంద్రుడిని ప్రత్యక్షంగా వీక్షించడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 6.30pm తర్వాత అద్భుతంగా కనిపిస్తుంది.