News October 29, 2024
ఓ బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే తట్టుకోవడం కష్టం: విజయమ్మ
AP: ఓ తల్లిగా తనకు జగన్, షర్మిల ఇద్దరూ సమానమేనని విజయమ్మ అన్నారు. అయితే ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటం నా ధర్మం. నా విధి. ఇంతమంది పెద్దలు చెప్తున్న అబద్ధాల మధ్య నిజాలు తెలియాలనే మీ మందుకు వచ్చా. YSR బతికి ఉంటే ఆస్తుల సమస్య వచ్చేది కాదు. దీనిపై ఇక ఎవరూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు’ అని లేఖలో కోరారు.
Similar News
News January 3, 2025
ఎన్డీయేలో చేరాలన్న ఒత్తిడి మాపై లేదు: అబ్దుల్లా
NDAలో చేరాలని తమపై ఎవరూ ఒత్తిడి తేవడం లేదని, ఆ వార్తల్లో నిజం లేదని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ‘BJP మాపై ఎటువంటి ఒత్తిడీ తీసుకురావట్లేదు. మా సర్కారును అస్థిరపరిచే ప్రయత్నాలేవీ చేయమని అగ్రనాయకత్వం మాట ఇచ్చింది. గతంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఇచ్చిన సహకారాన్ని నాకూ అందిస్తామని హామీ లభించింది’ అని తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
News January 3, 2025
కిస్సిక్ డ్యాన్స్ చేస్తే అమ్మ కొడుతుంది: శ్రీలీల
పుష్ప-2లో నటి శ్రీలీల చేసిన కిస్సిక్ సాంగ్ సూపర్ హిట్ అయింది. అయితే, ఆ డ్యాన్స్‌ను తన తల్లి చేయనివ్వట్లేదని శ్రీలీల తాజాగా తెలిపారు. ఎయిర్‌పోర్టులో ఆమె తల్లితో కలిసి వెళ్తుండగా ఫొటోలకు కిస్సిక్ స్టైల్లో ఫొటో కావాలని మీడియా ప్రతినిధులు కోరారు. ‘ఆ డ్యాన్స్ చేస్తే మా అమ్మ కొడుతోంది’ అంటూ శ్రీలీల సరదాగా వ్యాఖ్యానించారు. కాగా.. ఆమె సిద్దూ జొన్నలగడ్డ, రవితేజ, అఖిల్, నాగచైతన్య సినిమాల్లో నటిస్తున్నారు.
News January 3, 2025
తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్చార్జులు వీరే
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎన్నికల ఇన్చార్జుల్ని నియమించింది. తెలంగాణకు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే, ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటక బీజేపీ నేత పీసీ మోహన్ పేర్లను ప్రకటించింది. ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిని తమిళనాడుకు రిటర్నింగ్ అధికారిగా నియమించింది. బీజేపీ నిబంధనల ప్రకారం పార్టీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.