News May 25, 2024

పోలైన ఓట్ల సంఖ్యను మార్చడం అసాధ్యం: ఈసీ

image

ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్య వివరాలను మార్చడం అసాధ్యమని EC పేర్కొంది. VOTER TURNOUT యాప్ ద్వారా వివరాలను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేలా కొన్ని తప్పుడు కథనాలను గుర్తించినట్లు తెలిపింది. కాగా పోలింగ్ వివరాలు వెల్లడించాలని కొందరు సుప్రీంను ఆశ్రయించారు. ఎన్నికలు పూర్తవకుండా వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని SC వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో EC ప్రకటన విడుదల చేసింది.

Similar News

News November 18, 2025

సచివాలయాలకు పర్యవేక్షకులు వీరే..

image

AP: గ్రామ, వార్డు సచివాలయాలకు మండల స్థాయిలో పర్యవేక్షకులుగా 660 మంది డిప్యూటీ MPDOలను ప్రభుత్వం నియమించనుంది. అలాగే జిల్లా స్థాయిలో పర్యవేక్షకులుగా ZP CEO, డిప్యూటీ సీఈవో, జాయింట్ డైరెక్టర్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు అప్పగించనుంది. నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కాగా సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించిన విషయం తెలిసిందే. A కేటగిరీలో ఆరుగురు, Bలో 7, Cలో ఎనిమిది మంది ఉద్యోగులు ఉంటారు.

News November 18, 2025

మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం

image

AP: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతమయ్యాడు. హిడ్మాతో పాటు ఆయన భార్య సహా ఆరుగురు మావోలు మరణించారు. హిడ్మా కోసం పలు రాష్ట్రాల పోలీసులు ఎంతోకాలంగా వెతుకుతున్నారు. ప్రస్తుతం అతడు మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ సెక్రటరీగా ఉన్నాడు.