News January 7, 2025

ఎవరు లబ్ధి పొందారో తెలియాలి: హైకోర్టు జడ్జి

image

TG: KTR క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ జారీ చేసిన ఆర్డర్ కాపీలో జడ్జి కీలక అంశాలను ప్రస్తావించారు. HMDA పరిధికి మించి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిందని, క్యాబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. KTR ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయని ప్రభుత్వం అంటోందని, చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని జడ్జి పేర్కొన్నారు. అంతిమ లబ్ధిదారులెవరో బయటపడాలని తీర్పు కాపీలో వెల్లడించారు.

Similar News

News December 10, 2025

క్యాన్సర్ బాధితుడి తొలగింపు.. మానవత్వం మరిచారా?

image

పుణే(MH)లో అమానవీయ ఘటన జరిగింది. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ ఉద్యోగిని కంపెనీ అకస్మాత్తుగా తొలగించింది. ‘నాకు జీతం కాదు.. నా జీవితం కావాలి. నా కుటుంబ భవిష్యత్తు కోసం న్యాయం చేయండి’ అంటూ ఆ ఉద్యోగి అనారోగ్యాన్ని లెక్కచేయకుండా కంపెనీ గేటు ముందు నిరాహార దీక్షకు దిగాడు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన కంపెనీ ఇలా తొలగించడం దారుణమని వాపోయాడు. కంపెనీ తీరుపై నెట్టింట తీవ్ర విమర్శలొస్తున్నాయి.

News December 10, 2025

ప్రపంచంలోనే అతి పొడవైన హైవే ఇదే..!

image

ప్రపంచంలోకెల్లా అతి పొడవైన రహదారి ‘పాన్-అమెరికన్’ హైవే అని మీకు తెలుసా? దీని పొడవు దాదాపు 30,000 కిలోమీటర్లు. ఇది అలాస్కాలోని ప్రుడో బే నుంచి మొదలై ఎలాంటి యూటర్న్ లేకుండా 14 దేశాల గుండా అర్జెంటీనా వరకు విస్తరించి ఉంది. ఈ రహదారి మెక్సికో, పనామా, కొలంబియా, పెరూ, చిలీ వంటి దేశాలను కలుపుతుంది. వర్షారణ్యాలు, ఎడారులను దాటే ఈ మార్గంలో ప్రయాణం పూర్తి చేయడానికి సగటున 60 రోజులు పడుతుంది.

News December 10, 2025

అఖండ-2 టికెట్ రేట్లు భారీగా పెంపు

image

అఖండ-2 సినిమా టికెట్ల పెంపునకు TG ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎల్లుండి సినిమా రిలీజ్ కానుండగా రేపు రా.8 గంటల ప్రీమియర్ షో టికెట్ రేట్‌ను రూ.600గా నిర్ధారించింది. ఈ నెల 12 నుంచి 14 వరకు మల్టీప్లెక్సుల్లో రూ.100 చొప్పున, సింగిల్ స్క్రీన్లలో రూ.50 చొప్పున టికెట్ రేట్ పెంచుకోవచ్చని పేర్కొంది. కాగా అఖండ-2 టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం <<18519580>>ఇప్పటికే<<>> అనుమతి ఇచ్చింది.