News February 8, 2025
ఆప్‌ను గెలిపించే బాధ్యత మాది కాదు: కాంగ్రెస్
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించే బాధ్యతేమీ తమకు లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే వ్యాఖ్యానించారు. ‘వారి గెలుపు బాధ్యత మాది కాదు కదా? స్ఫూర్తిదాయకమైన పోరాటంతో ఎన్నికల్లో బలమైన ప్రదర్శన చేయడమే మా బాధ్యత. కేజ్రీవాల్ గోవా, హరియాణా, గుజరాత్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేశారు కదా? గోవా, ఉత్తరాఖండ్‌లో ఆప్‌కు వచ్చిన ఓట్ల తేడాతోనే మేం ఓడిపోయాం’ అని గుర్తుచేశారు.
Similar News
News February 8, 2025
RESULTS: ఇప్పటివరకు ఎవరికి ఎన్ని సీట్లు?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మేజిక్ ఫిగర్ దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ 19 చోట్ల విజయం సాధించగా మరో 27 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అధికారం చేపట్టాలంటే 36 సీట్లు అవసరం. కానీ ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే కాషాయ పార్టీ అంతకుమించిన స్థానాల్లో గెలుపొందేలా కనిపిస్తోంది. మరోవైపు కేజ్రీవాల్, సిసోడియా ఓటములతో చతికిలపడ్డ ఆప్ 8 చోట్ల గెలుపొందింది. మరో 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
News February 8, 2025
AAPకి అధికారం ఎందుకు దూరమైందంటే?
2015, 2020 ఎన్నికల్లో 70 స్థానాలకు 67, 62 స్థానాల్లో అద్భుత విజయం సాధించి అధికారంలోకి వచ్చిన AAPను ఈసారి పలు వివాదాలు చుట్టుముట్టాయి. హామీలు అమలు చేయకపోవడం, ఎయిర్ క్వాలిటీపై ప్రజల అసంతృప్తి, CM అధికార నివాసం శేష్ మహల్‌ను రూ.33.66 కోట్లతో అభివృద్ధి చేసుకోవడంపై ఆరోపణలు, AK అవినీతిపై BJP ప్రచారం, లిక్కర్ స్కాంలో AK, మంత్రులు, AAP నేతలు జైలుకెళ్లడంతో పాలన గాడితప్పి ఆ పార్టీని అధికారానికి దూరం చేశాయి.
News February 8, 2025
సిబిల్ స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేశారు!
చిత్ర విచిత్రమైన కారణాలతో వివాహాలను రద్దు చేసుకుంటున్నారు. తాజాగా వధువు కుటుంబం వరుడి సిబిల్ స్కోర్ తెలుసుకుని పెళ్లిని రద్దు చేసుకుంది. మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌లో అమ్మాయి, అబ్బాయి ఓకే చెప్పడంతో పెద్దలు వివాహం కుదిర్చారు. అయితే, అమ్మాయి మేనమామ అబ్బాయి CIBIL స్కోర్ చెక్ చేయాల్సిందేనని పట్టుబట్టాడు. అది చూసి అతను కాబోయే భార్యకు ఆర్థిక భద్రత కల్పించలేడని పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు.