News May 21, 2024

మీడియా సంస్థలపై కేసులు పెట్టడం సరికాదు: నాదెండ్ల

image

AP: విశాఖలో ధనలక్ష్మి కుటుంబంపై దాడికి కారకులెవరో పోలీసులే చెప్పాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. బాధితుల వేదనను ప్రసారం చేసిన మీడియా సంస్థలపై కేసులు పెట్టడం దారుణమన్నారు. ఈ కేసులు రాజకీయ ప్రేరేపితమని.. మీడియా ప్రతినిధులను భయపెట్టే చర్యలు సరికాదన్నారు. విశాఖలో ఇటీవల ధనలక్ష్మి కుటుంబంపై కొందరు దాడి చేశారు. తమ పార్టీకి ఓటు వేయలేదని YCP శ్రేణులే దాడి చేశాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Similar News

News February 15, 2026

EAPCET.. జోన్ మార్చడం కుదరదు

image

TG: EAPCET-2026 దరఖాస్తులు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 జోన్లు ఏర్పాటు చేశారు. ఒకసారి <>జోన్<<>> సెలక్ట్ చేసుకున్నాక ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చే ప్రసక్తి లేదని అధికారులు స్పష్టం చేశారు. అప్లై సమయంలో జాగ్రత్తగా జోన్ ఎంచుకోవాలని సూచించారు. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 9, 10 11 తేదీల్లో ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

News February 15, 2026

AIIMS కల్యాణిలో 137 పోస్టులు

image

AIIMS కల్యాణి 137 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD/MS/DNB/MSc/PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. మార్చి 3,5,6 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://aiimskalyani.edu.in

News February 15, 2026

టోల్ వసూలు రూల్స్‌లో మార్పులు.. నేటి నుంచే!

image

నేషనల్ ఎక్స్‌ప్రెస్ వేలపై టోల్ వసూలు రూల్స్‌లో కేంద్రం మార్పులు చేసింది. ఇకపై పూర్తిగా అందుబాటులోకి రాని ఎక్స్‌ప్రెస్ వేల్లో మొత్తం టోల్ కట్టాల్సిన అవసరం ఉండదు. పనులు పూర్తయిన మేరకే ఛార్జీలు వసూలు చేస్తారు. ఇది నేటి నుంచే అమల్లోకి రానుంది. దీంతో కొంత భాగమే ప్రారంభించిన ఎక్స్‌ప్రెస్ వేలపై టోల్ భారం తగ్గనుంది. ప్రస్తుతం నేషనల్ హైవేలతో పోలిస్తే ఎక్స్‌ప్రెస్ వేలపై 25% ఎక్కువగా వసూలు చేస్తున్నారు.