News January 28, 2025
లోకేశ్‌కు Dy.CM ఇవ్వాలనడం సరికాదు: గోరంట్ల

AP: మంత్రి లోకేశ్‌కు Dy.CM పదవి ఇవ్వాలన్న అంశంపై MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. TDP నేతలు ఆ పదవి ఇవ్వాలనడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారని చెప్పారు. పార్టీ కోసం లోకేశ్ కష్టపడి పని చేశారని, అందుకు ఆయనకు సముచిత స్థానం ఇచ్చారని తెలిపారు. లోకేశ్‌కు Dy.CM ఇవ్వాలని ఇటీవల పలు సందర్భాల్లో ఆ పార్టీ నేతలు కొందరు కోరగా టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 5, 2025
అనకాపల్లి: పోలీస్ ఆరోగ్య భీమా పథకాన్ని ప్రారంభించిన హోంమంత్రి

పోలీస్ ఆరోగ్య భీమా పథకాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం విశాఖ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రారంభించి ఇన్సూరెన్స్ బాండ్లను పోలీస్ సిబ్బందికి అందజేశారు. సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే పోలీసులకు ఆరోగ్య భీమా పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అహర్నిశలు శ్రమించే పోలీసుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు.
News December 5, 2025
బెంజ్, రేంజ్ రోవర్ కాకుండా ఫార్చునర్.. అందుకేనా?

నిన్న మోదీ, పుతిన్ టయోటా ఫార్చునర్ కారులో ప్రయాణించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. రేంజ్ రోవర్, బెంజ్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ వారు ఫార్చునర్‌లోనే ప్రయాణించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా 2022లో అమెరికాతో పాటు యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశాల కార్లు కాకుండా జపాన్‌కు చెందిన టయోటాను ఎంచుకుని మోదీ, పుతిన్ వారికి బలమైన సందేశం పంపినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.
News December 5, 2025
ఫ్రెండ్‌తో అన్నీ పంచుకుంటున్నారా?

స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు. కానీ ఆ చెప్పే విషయాల్లో భార్యాభర్తల అనుబంధాన్నీ చేర్చవద్దంటున్నారు నిపుణులు. వారి మధ్య జరిగే విషయాల్ని మూడోవ్యక్తితో చర్చించకపోవడమే మంచిదంటున్నారు. భాగస్వామితో చిన్న గొడవ గురించి స్నేహితులకు చెబితే మీవారిపై నెగెటివ్ అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. ప్రతిదానికీ బయటివారి సలహాలు కోరుతూ ఉంటే నమ్మకం పోవడమే కాదు.. ఇతరులకీ చులకన అవుతారు. మరిన్ని గొడవలకూ కారణమవొచ్చు.


