News September 20, 2024
బరువు తగ్గేందుకు ఓకేగానీ ఆ డైట్తో గుండె, పొట్టకు ప్రమాదం!

బరువు తగ్గేందుకు సాయపడే కీటోడైట్ గుండె, పొట్టకు అంత మంచిది కాదని సెల్ రిపోర్ట్స్ మెడిసిన్లో పబ్లిషైన కొత్తస్టడీ పేర్కొంది. దానికన్నా లోషుగర్ డైట్ బెటరంది. ‘కీటో వల్ల జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా నాశనమవుతోంది. మైక్రోబయోమ్ వైవిధ్యం దెబ్బతింటోంది. ఎక్కువ కొవ్వు తింటే బాడీలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. గుండె జబ్బులకు కారణమయ్యే అపోలిపో ప్రొటీన్ పెరగడాన్ని మూత్రంలో గమనించాం’ అని పేర్కొంది.
Similar News
News November 21, 2025
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను అందించాలి: కలెక్టర్

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతితో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్సైలతో సమావేశమయ్యారు. తక్షణమే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను అందించాలని ఆదేశించారు. ఎన్నికలలో తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News November 21, 2025
నడుము చుట్టుకొలత పెరిగితే డేంజరే

భారతీయుల శరీర నిర్మాణం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇతర దేశాలవారిలో ఒకే BMI ఉన్నా, భారతీయుల్లో కొవ్వు శాతం కాస్త అధికంగా ఉంటుంది. ముఖ్యంగా భారతీయుల్లో నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. పురుషుల్లో 35.4 అంగుళాలు, స్త్రీలలో 31.5 అంగుళాలు నడుము చుట్టుకొలత దాటితే అంతర్గత కొవ్వు పెరిగి డయాబెటీస్ వస్తుందంటున్నారు. దీనికోసం సమయానికి, సరైన ఆహారం మితంగా తీసుకోవడం, వ్యాయామం, ధ్యానం చేయాలని సూచిస్తున్నారు.
News November 21, 2025
స్పీకర్ను కలిసిన కడియం శ్రీహరి.. రాజీనామా ప్రచారం?

TG: పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ప్రసాద్ ఇచ్చిన నోటీసుకు MLA కడియం శ్రీహరి స్పందించారు. గడువు(23)కు ముందే ఆయన్ను కలిసి వివరణకు మరింత సమయం కావాలని కోరారు. దీనిపై సభాపతి సానుకూలంగా స్పందించారు. మరోవైపు 2రోజుల్లో శ్రీహరి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపు వేడిలోనే స్టేషన్ ఘన్పూర్లోనూ బైపోల్కు వెళ్లి BRSను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ స్కెచ్ వేసినట్లు చర్చ జరుగుతోంది.


