News August 1, 2024
ఇది ఒకరి విజయం, మరొకరి పరాజయం కాదు: మందకృష్ణ

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వంద తరాల భవిష్యత్తును నిర్దేశించబోతుందని మందకృష్ణ మాదిగ చెప్పారు. ‘ఒక పోరాటంలో న్యాయం జరుగుతుందని భవిష్యత్ తరాలకు ఈ తీర్పు ఆత్మవిశ్వాసం అందిస్తుంది. ఈ విజయంతో మాదిగ, ఉపకులాలు ముందడుగు వేస్తాయి. ఇది ఒక కులం విజయమో, మరో కులం అపజయమో కాదు. మాల సోదరులు అర్థం చేసుకోవాలి. అంబేడ్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందరికీ పంచడమే ఈ తీర్పు ఉద్దేశం’ అని పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్‌లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు

<


