News August 31, 2024
అది దేశ సామరస్యానికి సంబంధించినది.. ‘ఎమర్జెన్సీ’ వివాదంపై SGP కమిటీ

‘ఎమర్జెన్సీ’ చిత్రంపై నెలకొన్న వివాదం కేవలం సిక్కులకు సంబంధించినది మాత్రమే కాదని, దేశ సామరస్యానికి సంబంధించినదని శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ పేర్కొంది. కేవలం కంగనా రనౌత్ ఉన్నందున సినిమాను వ్యతిరేకించే ఉద్దేశం తమకు లేదని, ఈ వివాదం తమ వాదనపై ఆధారపడిందని కమిటీ GS గురుచరణ్ తెలిపారు. చిత్రంలో వాస్తవాలను తప్పుగా చూపించారంటూ సిక్కు వర్గాలు తప్పుబడుతున్నాయి.
Similar News
News November 17, 2025
నేడు నక్తం పాటిస్తున్నారా?

ఈ పవిత్ర కార్తీక మాసంలో చివరి సోమవారానికి చాలా విశిష్టత ఉంది. గత సోమావారాల్లో ఆచరించని విధులను నేడు ఆచరిస్తే అంతకన్నా ఎక్కువ ఫలితం ఉంటుందని నమ్మకం. శివ భక్తులు ముఖ్యంగా నేడు ‘నక్తం’ దీక్షను పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా సకల శుభాలు కలుగుతాయని అంటున్నారు. నక్తం అంటే.. పగలు ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేయడం. ఈ దీక్షతో శివానుగ్రహంతో అఖండ పుణ్యం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం.
News November 17, 2025
నేడు నితీశ్ రాజీనామా.. 20న ప్రమాణం?

బిహార్లో ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా CM నితీశ్ కుమార్ ఇవాళ రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈనెల 20న ఆయన తిరిగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. మొత్తం 32 మందితో కొత్త క్యాబినెట్ కొలువుదీరనుందని, బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని సమాచారం. స్పీకర్గా బీజేపీ సభ్యుడినే నియమిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉందని చెప్పాయి.
News November 17, 2025
శివ పూజలో తులసిని వాడుతున్నారా?

శివుడికి సంబంధించి ఏ పూజలు నిర్వహించినా అందులో మాల, తీర్థం ఏ రూపంలోనూ తులసిని వినియోగించకూడదనే నియమం ఉంది. శివ పురాణం ప్రకారం.. తులసి వృంద అనే పతివ్రతకు ప్రతిరూపం. ఆమె భర్త జలంధరుడిని శివుడు సంహరించాడు. అప్పుడు శివుడి పూజలో తన పవిత్ర రూపమైన తులసిని వాడరని శాపమిచ్చింది. అందుకే శివుడికి బిల్వపత్రాలు ప్రీతిపాత్రమైనవి. గణపతి పూజలోనూ తులసిని ఉపయోగించరు.


