News May 20, 2024

సన్న వడ్లకే బోనస్ ఇస్తామనడం బాధాకరం: హరీశ్ రావు

image

TG: వడ్లకు <<13283753>>బోనస్<<>> విషయంలో కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధం ఆడారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. బోనస్ ఇస్తామని చెప్పి గెలిచాక మాట మార్చారని దుయ్యబట్టారు. కేవలం సన్నరకం వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో 90 శాతం దొడ్డు రకం వడ్లనే పండిస్తారని.. 10 శాతం పండించే సన్న వడ్లకు మంచి డిమాండ్ ఉందని చెప్పారు. ఈ సీజన్లో అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.

Similar News

News December 24, 2024

యశస్వీ జైస్వాల్ ఆ తప్పు చేస్తున్నారు: పుజారా

image

భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ క్రీజులో ఫాస్ట్‌గా ఆడాలని కంగారు పడుతున్నారని క్రికెటర్ పుజారా అభిప్రాయపడ్డారు. తొలి 15 పరుగులు వేగంగా చేయాలనుకుని తప్పు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ వంటి దూకుడైన ఆటగాడు సైతం బంతి తన జోన్‌లో ఉన్నప్పుడే బలంగా బాదుతారు. కానీ జైస్వాల్ అనవసరమైన షాట్స్ ఆడుతున్నారు. బంతిని వద్దకు రానివ్వాలి. క్రీజులో ఎక్కువ సేపు నిలబడాలి’ అని సూచించారు.

News December 24, 2024

‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటన.. ఏ-18గా మైత్రీ మూవీ మేకర్స్

image

‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు మైత్రీ మూవీ మేకర్స్‌ను ఏ-18గా చేర్చారు. ఇప్పటికే హీరో అల్లు అర్జున్‌ను ఏ-11గా చేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్, సెక్యూరిటీ సిబ్బంది, ఫ్లోర్ ఇన్‌ఛార్జి, అల్లు అర్జున్ బౌన్సర్లను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్‌తోపాటు సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

News December 24, 2024

ముగిసిన శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు

image

సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్కులో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. ఆయన కుటుంబీకులు, సినీరంగ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక సెలవంటూ అశ్రునయనాలతో నివాళులర్పించారు. ఆయన రూపొందించిన కళాఖండాల్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మూత్ర పిండాల సమస్యతో శ్యామ్ సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.