News July 28, 2024
షా లాంటి వ్యక్తి హోంమంత్రి కావడం విచిత్రమే: పవార్

అమిత్ షా వంటి వ్యక్తి హోంమంత్రి కావడం విచిత్రమేనని ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ‘నేను దేశంలోని అవినీతిపరుల ముఠాకు నాయకుడినని షా అసత్యాలు పలికారు. ఓ కేసు విషయంలో సుప్రీం కోర్టు ఆయన్ను 2ఏళ్ల పాటు గుజరాత్ నుంచి బహిష్కరించింది. అలాంటి మనిషి నేడు మనకు హోంమంత్రి. దేశం ఎలాంటివారి చేతిలో ఉందో అందరూ ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తులు దేశాన్ని అవినీతిదారిలోనే నడిపిస్తారు’ అని మండిపడ్డారు.
Similar News
News November 10, 2025
శ్రీశైలంలో ఈనెల 14న కోటి దీపోత్సవం

AP: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో తొలిసారిగా ఈ నెల 14న కోటి దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఉచితంగా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. దీపోత్సవానికి అవసరమైన పూజా సామగ్రిని దేవస్థానమే అందజేస్తుందని పేర్కొన్నారు. ఇందులో పాల్గొనేందుకు పరిపాలన భవనంలోని శ్రీశైల ప్రభ కార్యాలయంలో 12వ తేదీలోపు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
News November 10, 2025
AAIలో అప్రెంటిస్ పోస్టులు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) 20గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ, డిగ్రీ (B.COM, BA, BSc, BBA), డిప్లొమా అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24 వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.15వేలు, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.12వేలు చెల్లిస్తారు. అభ్యర్థులు NATS పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్: https://www.aai.aero
News November 10, 2025
కరివేపాకు మొక్కలు గుబురుగా పెరగాలంటే?

కరివేపాకు మొక్కలు ఒక మీటరు ఎత్తు పెరిగాక మొక్క చివర్లను తుంచాలి. ఇలా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి మొక్కలు గుబురుగా పెరుగుతాయి. మూడేళ్లు వచ్చిన కరివేపాకు చిన్న కొమ్మలను మొక్క మొదలు వరకు తుంచి, 4 లేదా 5 శాఖలు ఉండేలా ఉంచితే ఎక్కువ దిగుబడి వచ్చి ఆదాయం పెరుగుతుంది. అలాగే పంట కోసిన తర్వాత ప్రతిసారీ 50 కిలోల నత్రజని, 50 కిలోల పొటాష్ అందించే ఎరువులను మొక్కలకు వేస్తూ ఉండాలి.


