News May 25, 2024
కోట్లకు పడగలెత్తిన వారిపై పన్నులు పెంచాలని సూచన

దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలను తగ్గించడానికి సంపన్నులపై కరోడ్‌పతి ట్యాక్స్ విధించాలని ఫ్రాన్స్‌కు చెందిన వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ ఆర్థికవేత్తలు సూచించారు. 2010 తర్వాత కోట్లకు పడగలెత్తిన వారి సంపదపై పన్ను, వారసత్వ పన్ను ఉండాలని తెలిపారు. ₹10 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 2%, ₹100 కోట్లు దాటితే 4%.. వారసత్వ పన్ను ₹10 కోట్ల పైన 33%, ₹100 కోట్ల పైన 45% విధించాలని పేర్కొన్నారు. దీనిపై మీరేమంటారు?
Similar News
News November 8, 2025
ఎంత కాలం రెంట్‌కి ఉన్నా ఓనర్లు కాలేరు: సుప్రీం

‘ది లిమిటేషన్ యాక్ట్-1963’ ప్రకారం 12 ఏళ్లు ఒకే ఇంట్లో ఉంటే ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు. అందుకే కొందరు తమ టెనంట్లను ఎక్కువ కాలం ఉండనివ్వరు. ఈక్రమంలో యజమానుల హక్కులను కాపాడుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అద్దెకున్న ఇంట్లో ఎంతకాలం నివసించినా ఆ ఆస్తిపై యాజమాన్య హక్కు పొందలేరని స్పష్టం చేసింది. ఢిల్లీ కోర్టు తొలుత టెనంట్ పక్షాన నిలువగా.. సుప్రీం ఈ గందరగోళానికి ముగింపు పలికింది.
News November 8, 2025
మీ కలలను నెరవేర్చలేకపోతున్నా.. NEET విద్యార్థి సూసైడ్

వైద్య కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే NEETలో ఫెయిలైనందుకు UPకి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రావత్పూర్లోని హాస్టల్ గదిలో మహమ్మద్ ఆన్(21) సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ‘అమ్మానాన్న ప్లీజ్ నన్ను క్షమించండి. నేను చాలా ఒత్తిడిలో ఉన్నా. మీ కలలను నెరవేర్చలేకపోతున్నాను. నేను చనిపోతున్నా. దీనికి పూర్తిగా నేనే బాధ్యుడిని’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
News November 8, 2025
యసీన్ పటేల్ ఊచకోత.. భారత్ ఓటమి

హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో కువైట్ చేతిలో భారత్ ఓడిపోయింది. తొలుత కువైట్ 6 ఓవర్లలో 106-5 స్కోర్ చేసింది. ఆ జట్టులోని యసీన్ పటేల్ 14 బంతుల్లోనే 58 రన్స్(8 సిక్సర్లు,2 ఫోర్లు) చేశారు. చివరి ఓవర్లో వరుసగా 6, 6, 6, 6, 6, 2 బాదారు. తర్వాత భారత్ 5.4 ఓవర్లలో 79 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. ఈ టోర్నీలో ఇరు జట్లు చెరో 6 ఓవర్లు ఆడతాయి. ఒక్కో టీమ్ నుంచి ఆరుగురు మాత్రమే బ్యాటింగ్ చేస్తారు.


