News August 3, 2024
పతకాల పందెంలో ముందున్న దేశాలివే
ఒలింపిక్స్‌లో పతకాల వేటలో ఎప్పటిలాగే చైనా దూసుకుపోతోంది. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్ 3 కాంస్య పతకాలతో 47వ స్థానంలో ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు తొలి 5 దేశాలను చూస్తే..
1. చైనా- 31 పతకాలు(13 గోల్డ్)
2. ఫ్రాన్స్- 35 పతకాలు(11 గోల్డ్)
3. ఆస్ట్రేలియా- 22 పతకాలు (11 గోల్డ్)
4. అమెరికా- 43 పతకాలు (9 గోల్డ్)
5. గ్రేట్ బ్రిటన్- 27 పతకాలు (9 గోల్డ్)
Similar News
News February 3, 2025
17% పెరిగిన జీఎస్టీ ఆదాయం
తెలంగాణలో జీఎస్టీ, వ్యాట్ రాబడులు పెరిగాయి. జనవరిలో ఏకంగా 17 శాతం జీఎస్టీ ఆదాయం పెరిగింది. 2024 జనవరిలో రూ.3351.88 కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ఈ ఏడాది JANలో రూ.3921.68 కోట్లు వచ్చాయి. గత 10 నెలల్లో జీఎస్టీ, వ్యాట్ కింద రూ.62858.55 కోట్లు వసూలు అయ్యాయి.
News February 3, 2025
APకి రూ.9,417కోట్లు, TGకు రూ.5,337 కోట్లు: అశ్వినీ వైష్ణవ్
రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల కేటాయింపులపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. ‘తెలంగాణకు రూ.5,337cr, APకి రికార్డు స్థాయిలో రూ.9,417cr కేటాయించాం. తెలంగాణ వ్యాప్తంగా 1,326KM కవచ్ టెక్నాలజీ పని చేస్తోంది. APకి UPA హయాంలో కంటే 11రెట్లు ఎక్కువ కేటాయించాం. APలో 73రైల్వేస్టేషన్ల అభివృద్ధికి నిధులిచ్చి రూపురేఖలు మారుస్తున్నాం. రూ.8,455cr విలువైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేశాం’ అని అన్నారు.
News February 3, 2025
తండ్రిని రెండు ముక్కలు చేయాలనుకున్నారు!
తండ్రికి అంత్యక్రియలు చేసేందుకు ఆ ఇద్దరు కొడుకులు పోటీ పడ్డారు. ఈక్రమంలో మృతదేహాన్ని గంటల తరబడి ఇంటి బయటే వదిలేశారు. చివరికి శవాన్ని 2 ముక్కలు చేసి చెరో ముక్కకు ఇద్దరు అంత్యక్రియలు చేయాలన్న నిర్ణయానికొచ్చారు. ఆ నిర్ణయం విని హడలిపోయిన స్థానికులు పోలీసులకు విషయాన్ని చేరవేశారు. పోలీసులు పెద్ద కొడుక్కి కర్మకాండ బాధ్యతల్ని అప్పగించారు. MPలోని టీకమ్ గఢ్ జిల్లా తాల్ లిధోరా గ్రామంలో ఈ ఘటన జరిగింది.