News August 30, 2024
చరిత్ర లిఖించిన అవని లేఖరా

పారిస్ పారాలింపిక్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన భారత షూటర్ <<13976406>>అవని లేఖరా<<>> చరిత్ర సృష్టించారు. వరుసగా 2 ఒలింపిక్స్లో బంగారు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్గా ఘనత సాధించారు. ఈమె 2020 టోక్యో పారాలింపిక్స్లో గోల్డ్, బ్రాంజ్ మెడల్స్ పొందారు. మెన్స్/ఉమెన్స్, ఒలింపిక్స్/పారా ఒలింపిక్స్లో ఎవరికీ ఈ ఫీట్ సాధ్యం కాలేదు.
Similar News
News September 18, 2025
జుట్టు లేని కొబ్బరి కాయను కొట్టకూడదా?

దేవుడికి జుట్టు లేని కొబ్బరికాయను కొట్టకూడదని పండితులు చెబుతున్నారు. కొబ్బరికాయ మన శరీరానికి ప్రతీక. దానిపై ఉన్న పీచు మనలోని అహంకారానికి, జ్ఞానానికి చిహ్నం. భగవంతునికి మన శరీరాన్ని, ఆత్మను సంపూర్ణంగా సమర్పించుకోవడానికి కొబ్బరికాయ కొడతాం. అందుకే జుట్టు ఉన్న కొబ్బరికాయనే కొట్టి, ఆత్మనివేదన అనే భక్తి మార్గాన్ని అనుసరించాలి. జుట్టు లేని కాయను సమర్పించడం అసంపూర్ణ సమర్పణగా భావిస్తారు.
News September 18, 2025
సాయిబాబా విగ్రహం పాలరాయితోనే ఎందుకు?

పాలరాయి ఆధ్యాత్మికంగా స్వచ్ఛతకు, బలానికి ప్రతీక. ఈ లక్షణాలు బాబా బోధనలకు అనుగుణంగా ఉంటాయి. పాలరాయి విగ్రహం ఉన్న చోట ప్రశాంతమైన, సామరస్య పూర్వక వాతావరణం ఏర్పడుతుందని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ఇది సహజమైనది, ప్రాసెస్ చేయనిది కావడంతో పవిత్రంగా పూజా మందిరాల్లో ఉంచుకోవడానికి ఇష్టపడతారు. అనేక ఆలయాల్లోనూ పాలరాయితో చేసిన సాయిబాబా విగ్రహాలే మనకు దర్శనమిస్తుంటాయి.
News September 18, 2025
నవ గ్రహాలు – భార్యల పేర్లు

సూర్యుడు – ఉష, ఛాయ
చంద్రుడు – రోహిణి
కుజుడు – శక్తి దేవి
బుధుడు – జ్ఞాన శక్తి దేవి
గురుడు – తారా దేవి
శుక్రుడు – సుకీర్తి దేవి
శని – జేష్ఠా దేవి
రాహువు – కరాళి దేవి
కేతువు – చిత్రాదేవి