News December 15, 2024
EVMలను నిందించడం తప్పు: ఒమర్ అబ్దుల్లా

EVMల ట్యాంపరింగ్‌పై INDIA కూటమి చేస్తున్న విమర్శల నుంచి NC దూరం జరిగింది. ఆశించిన ఫలితాలు రానప్పుడు EVMలను నిందించడం తగదని JK CM ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. LS ఎన్నికల్లో 100 సీట్లు గెలిచినప్పుడు సంబరాలు చేసుకొని, కొన్ని నెలలకే అనుకూల ఫలితాలు రాలేదని ఈవీఎంలపై మాట మార్చడం సరికాదన్నారు. ఈ విషయంలో తన వైఖరి బీజేపీ వాదనకు వత్తాసుపలకడం కాదన్నారు. వాస్తవాన్ని చెప్పానన్నారు.
Similar News
News December 11, 2025
మేడిన్ ఇండియా హైడ్రోజన్ ట్రైన్ వచ్చేస్తోంది

భారతీయ రైల్వే నిర్మించిన తొలి హైడ్రోజన్ ట్రైన్‌కు త్వరలో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన (10 కోచ్‌లు), అత్యంత శక్తిమంతమైన (2400 కిలోవాట్లు) హైడ్రోజన్ ట్రైన్‌గా ఇది గుర్తింపు పొందినట్లు చెప్పారు. రెండు డ్రైవింగ్ పవర్ కార్స్ (DPCs), ఎనిమిది ప్యాసింజర్ కోచ్‌లతో ఈ రైలును పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు.
News December 11, 2025
జాగ్రత్తగా ఓటేయండి.. గ్రామాల పురోగతికి పాటుపడండి!

TG: గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యలు తీర్చడంలో సర్పంచ్‌లదే కీలకపాత్ర. నోటు, క్వార్టర్, బిర్యానీకి ఆశపడి ఓటును అమ్ముకుంటే ఐదేళ్లూ ఇబ్బందిపడాల్సిందే. కులం, బంధుత్వాలు, పార్టీలు చూసి అసమర్థుడికి ఓటేస్తే అధోగతే. అందుకే 24/7 అందుబాటులో ఉండే, సమస్యలపై స్పందించే నాయకుడిని ఎన్నుకోవాలి. ఇందులో యువత పాత్ర కీలకం. సమర్థుడికి <<18527601>>ఓటేసి<<>>, కుటుంబీకులతోనూ ఓట్లేయించి గ్రామాల పురోగతికి పాటుపడండి.
News December 11, 2025
భారత వాతావరణశాఖలో 134 పోస్టులు.. అప్లై చేశారా?

భారత వాతావరణ శాఖ(<


