News September 13, 2024
టీసీఎస్‌లో వేల మంది ఉద్యోగులకు ఐటీ తాఖీదులు

టీసీఎస్‌లో పని చేస్తున్న 30 నుంచి 40 వేల మంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించాలని, రిఫండ్లు సైతం ఆపేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. సాంకేతిక కారణాలతో TDS వివరాలు ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్‌లో అప్డేట్ కాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీనిపై అధికారులతో చర్చిస్తున్నామని, వేచి ఉండాలని ఉద్యోగులకు TCS సమాచారం అందించింది.
Similar News
News February 8, 2026
ఫిబ్రవరి 8: చరిత్రలో ఈరోజు

✒ 1897: మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జననం(ఫొటోలో) ✒ 1902: సుప్రసిద్ధ కవి ఆండ్ర శేషగిరిరావు జననం ✒ 1934: ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వర రావు జననం ✒ 1941: గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం ✒ 1957: నటి వై.విజయ జననం ✒ 1963: IND మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జననం
News February 8, 2026
చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా

యూఎస్ఏపై విజయంతో టీమ్ ఇండియా T20IWCలో వరుసగా అత్యధిక మ్యాచులు గెలిచిన జట్టుగా నిలిచింది. 2024 నుంచి ఇప్పటివరకు వరుసగా 9 మ్యాచులు గెలిచింది. దీంతో సౌతాఫ్రికా(2024లో 8విజయాలు)ను దాటేసింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా(8wins) ఉంది. అటు WCలో వన్డే, టీ20ల్లో కలిపి ఓవరాల్‌గా టీమ్ ఇండియా 100 విజయాలు పూర్తి చేసుకుంది. ఆస్ట్రేలియా(108) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో టీమ్ కావడం గమనార్హం.
News February 8, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


