News November 6, 2024
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు

ఏపీలో పలు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన నివాసం, కార్యాలయం, రొయ్యల ఫ్యాక్టరీలపై ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. 2019లో భీమవరంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌పై గ్రంథి శ్రీనివాస్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇటు పలు జిల్లాల్లో వ్యాపారుల ఇళ్లలో ఏసీబీ రైడ్స్ చేపట్టింది.
Similar News
News February 3, 2026
సన్‌స్క్రీన్ లోషన్ ఎంత రాసుకోవాలో తెలుసా?

వేసవిలోనే కాదు అన్ని సీజన్లలోనూ బయటకు వెళ్లేటప్పుడు చర్మ సంరక్షణకు సన్‌స్క్రీన్ లోషన్ వాడాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. రెగ్యులర్ యూసేజ్‌కు SPF 30 PA(ప్రొటెక్షన్ గ్రేడ్) ఉన్న ప్రొడక్ట్ వాడుకోవచ్చు. ఎండలో తిరిగే వాళ్లు SPF 60/అంతకంటే ఎక్కువ ఉన్న లోషన్ ఉపయోగించాలి. ముఖం, మెడకు కలిపి 1/4 టీ స్పూన్ క్రీమ్ రాసుకోవాలి. లోషన్ వాడటమే కాదు, ఎంత పరిమాణం రాసుకుంటున్నామనేదీ ముఖ్యమే.
News February 3, 2026
ఆయుష్ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు

<
News February 3, 2026
వంటింటి చిట్కాలు

* గార్లిక్ బ్రెడ్ అందుబాటులో లేనప్పుడు కొన్ని వెల్లుల్లి రేకలను మెత్తగా చేసుకొని ఓ గంటపాటు పెరుగులో నానబెట్టి దాన్ని బ్రెడ్ స్లైసుల మీద పరిచి టోస్ట్ చేస్తే చాలు.
* కూరల్లో గ్రేవీ పలుచగా అయితే కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
* మాంసాన్ని సన్నని స్లైసుల్లా తరగాలనుకుంటే, దానిని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి, చాకుతో కోయాలి.
* సాంబారు రుచిగా ఉండాలంటే మసాలా పొడిలో కొద్దిగా నిమ్మరసం చేర్చాలి.


