News April 21, 2024

బాబు కోసమే పవన్ పుట్టి పెరిగినట్లుంది: సజ్జల

image

AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లో ఏ కోశానా నాయకుడి లక్షణాలు లేవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ‘చంద్రబాబు కోసమే పవన్ పుట్టి పెరిగినట్లు ఉంది. ఒక పార్టీ అధ్యక్షుడిలా ఆయన వ్యవహరించడం లేదు. బాబు బటన్ నొక్కితేనే పవన్ మాట్లాడతారు. కాపుల హక్కుల కోసం ఆయన ఏనాడైనా నోరువిప్పారా? జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకే కూటమిగా వస్తున్నారు. జగన్ ఓ వైపు.. గుంటనక్కలు మరో వైపు’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News January 29, 2026

రసాయనాలతో లడ్డూ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు: పవన్

image

AP: నెయ్యి పేరుతో రసాయనాల మిశ్రమాన్ని తిరుమలకు సరఫరా చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రసాయనాలతో లడ్డూ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. వైసీపీ అరాచకాలను ప్రజలకు చెబుదామని జనసేన ఎమ్మెల్యేలతో సమావేశంలో అన్నారు. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై శాసనసభలో చర్చిద్దామని చెప్పారు. ఈ మీటింగ్‌‌లో ఎమ్మెల్యే <<18982020>>అరవ శ్రీధర్<<>> గురించీ చర్చించారని సమాచారం.

News January 29, 2026

BC జాబితా నుంచి TG తొలగించిన కులాలు ఇవే 1/2

image

TG: ఉమ్మడి APలోని BC జాబితా నుంచి మినహాయించిన 26 కులాలను రానున్న ఎన్నికల్లో బీసీ స్థానాల్లో పోటీకి అనుమతించరాదని GO ఇవ్వడం తెలిసిందే. బీసీ కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం బీసీ జాబితా నుంచి తొలగించిన కులాలు ఇలా ఉన్నాయి. బండార, కోర్చ, కళింగ, కూరాకుల, పొండార, సామంతుల/సమంత/సౌంతియా/సౌంటియా, ఆసాదుల/అసదుల, కెయుట/కెవుటో/కెవిటి, అచ్చుకట్లవాండ్లు, నాగవడ్డీలు, కుంచిటి/వక్కలిగ/వక్కలిగర/కుంచిటిగ.

News January 29, 2026

BC జాబితా నుంచి TG తొలగించిన కులాలు ఇవే 2/2

image

తెలంగాణలో BC జాబితా నుంచి తొలగించిన కులాల్లో ఇంకా… గుడియా, ఆగరు,అతగార, గవర, గోడబా, జక్కల, కాండ్ర, కొప్పులవెలమ, నాగవాసం (నాగవంశం), పోలినాటి వెలమ, తూర్పుకాపులు/గాజులకాపులు, సదర/సదరు, అరవ, బేరి వైశ్య/ బేరి చెట్టి, అతిరస కులాలున్నాయి. కాగా కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ సామాజిక, సాంస్కృతిక మూలాలను అనుసరించి AP BC జాబితాలోని 112 కులాలను TG అడాప్ట్ చేసుకుంది. కొత్తగా 17 కులాలను చేర్చింది.