News January 10, 2025
IT స్టాక్స్ దూసుకుపోతున్నాయ్..

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్గా ఆరంభమయ్యాయి. Sensex 77,682(+62) వద్ద, Nifty 23,551 (+25) వద్ద ట్రేడింగ్ ఆరంభించాయి. 5 Min Time Frameలో Bullish Candle ఫాం అయ్యింది. IT స్టాక్స్ 2.23% లాభాలతో దూసుకుపోతున్నాయి. రియల్టీ, ఆయిల్&గ్యాస్ షేర్లు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్ నష్టాల్లో నడుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Similar News
News November 19, 2025
ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలి: రాఘవరెడ్డి

జిల్లాలో ఆయిల్ పామ్ తోటల పెంపకంపై అధికారులతో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఆయిల్ ఫాం పంట సాగు విస్తీర్ణాన్ని పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని, ఉదయం 7 గంటలకే ఫీల్డ్ ఆఫీసర్స్ ఫీల్డ్లో ఉండాలని, రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాఘవరెడ్డి అన్నారు.
News November 19, 2025
X(ట్విటర్) డౌన్

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X(ట్విటర్) డౌన్ అయింది. ట్వీట్లు చేయలేకపోతున్నామని యూజర్లు ఇతర SM పేజీల్లో కామెంట్లు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే తరహా ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? COMMENT
News November 19, 2025
చలికి చర్మం పగులుతుందా?

చలి పెరగడంతో శరీరం పగిలి ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేసిన వెంటనే & పడుకునే ముందు మందపాటి, ఆయిల్ ఆధారిత మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాయండి. చలికాలంలో కూడా రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగితే చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్గా ఉంచవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి’ అని తెలిపారు.


