News October 28, 2024
రెండు రోజుల సమయం కావాలి: రాజ్ పాకాల

TG: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసులో విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలని పోలీసులకు KTR బావమరిది రాజ్ పాకాల లేఖ రాశారు. రెండు రోజుల గడువు కోరుతూ మోకిల పోలీసులకు న్యాయవాదుల ద్వారా లేఖ పంపారు. ఇవాళ విచారణకు రావాలని ఆయనకు పోలీసులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News December 4, 2025
ఒక్క సాంగ్ వాడినందుకు ఇళయరాజాకు ₹50 లక్షలు చెల్లింపు!

లెజెండరీ మ్యూజీషియన్ ఇళయరాజా ‘Dude’ సినిమాపై వేసిన కాపీరైట్ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఈ చిత్రంలో ‘కరుత్త మచ్చాన్’ సాంగ్‌ను అనుమతి లేకుండా వాడారని ఆయన చిత్రయూనిట్‌పై కేసు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ పరిష్కరించుకున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఆ సాంగ్ ఉపయోగించినందుకు రూ.50లక్షలు చెల్లిస్తామని ఇళయరాజాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నాయి.
News December 4, 2025
రష్యాతో స్నేహం.. ఎన్ని ఒత్తిళ్లున్నా డోంట్‌కేర్!

భారత్‌కు చిరకాల మిత్రదేశం రష్యా. అందుకే US నుంచి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నా రష్యాతో ఒప్పందాల విషయంలో ఇండియా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టెక్నాలజీ, సెక్యూరిటీ, డిఫెన్స్, ఎనర్జీ, ట్రేడ్, పెట్రోలియం రంగాల్లో ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇవి పాక్, చైనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు.
News December 4, 2025
ఆదిలాబాద్‌కు ఎయిర్‌బస్ తెస్తాం: CM రేవంత్

TG: అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని CM రేవంత్ పేర్కొన్నారు. ‘ఆదిలాబాద్‌కూ ఎయిర్‌పోర్టు కావాలని MLA పాయల్ శంకర్ నాతో అన్నారు. ఇదే విషయం నిన్న ఢిల్లీలో PM మోదీతో మాట్లాడాను. సంవత్సరం తిరిగేలోగా ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభిస్తాం. ఎర్రబస్సు రావడమే కష్టమనుకున్న ప్రాంతంలో ఎయిర్‌బస్ తీసుకొచ్చి.. కంపెనీలు నెలకొల్పే బాధ్యత తీసుకుంటున్నా’ అని తెలిపారు.


