News September 21, 2024
రూ.100 కోట్లు సాధించేందుకు ఆ మూవీకి 20 ఏళ్లు పట్టింది!

షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా జంటగా నటించిన ‘వీర్ జారా’ సినిమా 2004లో విడుదలైంది. అప్పట్లో వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.97 కోట్లు దక్కించుకుంది. ఆ తర్వాత నుంచి పలుమార్లు రి-రిలీజ్ అవుతూ వచ్చింది. ఈ ఏడాది కూడా 282 థియేటర్లలో మళ్లీ విడుదలై జనాదరణ పొంది జీవిత కాల కలెక్షన్లలో ఎట్టకేలకు రూ. 100 కోట్లు దాటింది. సినిమా మొత్తం గ్రాస్ రూ.101.75 కోట్ల మార్కును దాటిందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు.
Similar News
News January 30, 2026
దాడులు ఆపాలని ట్రంప్ రిక్వెస్ట్.. రష్యా అంగీకారం!

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై దాడులు చేయొద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రిక్వెస్ట్ చేశారని రష్యా తెలిపింది. ‘చర్చలు సజావుగా సాగేందుకు ఫిబ్రవరి 1 వరకు అటాక్ చేయొద్దని పుతిన్‌ను వ్యక్తిగతంగా ట్రంప్ కోరారు. అందుకు మేం అంగీకరించాం’ అని క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ చెప్పారు. ఈ విషయాన్ని ట్రంప్ కూడా ధ్రువీకరించారు. ఉక్రెయిన్‌లో తీవ్ర చలి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రిక్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
News January 30, 2026
MMRCLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News January 30, 2026
ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయాలు ఇవే

1.కింగ్ ఫాద్ (దమ్మామ్, సౌదీ): 776 చ.కి.మీ విస్తీర్ణం. ముంబై సిటీ కంటే పెద్దది.
2.డెన్వర్ (అమెరికా): 137.8 చ.కి.మీ. 16వేల అడుగుల పొడవైన రన్ వే ఉంటుంది.
3.కౌలాలంపూర్ (మలేషియా): 100 చ.కి.మీ. ‘ఎయిర్పోర్ట్ ఇన్ ది ఫారెస్ట్’ అని పిలుస్తారు. ప్రపంచంలో అతి ఎత్తైన ATC (133.8 మీటర్లు) ఇక్కడే ఉంది.
4.ఇస్తాంబుల్ (తుర్కియే): 76.5 చ.కి.మీ.
5.డల్లాస్ (అమెరికా): 69.7 చ.KM.
>టాప్-10లో భారత విమానాశ్రయాలు లేవు.


