News October 12, 2025
అది టెక్నికల్ ఎర్రర్: అఫ్గాన్ మంత్రి

మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్టులకు అనుమతివ్వకపోవడంపై అఫ్గాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ క్లారిటీ ఇచ్చారు. అది కావాలని చేసింది కాదని, టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగిందని తెలిపారు. భారత మీడియా, పొలిటీషియన్స్ నుంచి విమర్శలు రావడంతో ఆయన స్పందించారు. ఇందులో వివక్ష లేదని, కొద్ది మంది జర్నలిస్టులకే ఆహ్వానం పంపడంతో ఇలా జరిగిందన్నారు. కాగా ఇవాళ్టి ప్రెస్ మీట్‌కు మహిళా జర్నలిస్టులను ఆహ్వానించడం గమనార్హం.
Similar News
News October 12, 2025
బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తాం: చంద్రబాబు

AP: రాష్ట్రంలో ఎక్కడైనా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మితే బెల్ట్ తీస్తామని CM CBN హెచ్చరించారు. నకిలీ మద్యం కేసుకు సంబంధించి నెల్లూరు రేంజ్ IG అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశామన్నారు. వ్యాపారం పేరుతో నకిలీ మద్యం తయారు చేస్తామంటే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు కల్తీ మద్యాన్ని గుర్తించేందుకు ‘AP ఎక్సైజ్ సురక్షా యాప్’ను రిలీజ్ చేశారు. యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా యాప్‌ను తీర్చిదిద్దామన్నారు.
News October 12, 2025
వేరుశనగలో ఇనుపధాతులోపం.. నివారణ

ఆకులలో పత్రహరితం తయారవడానికి ఇనుపధాతు కీలకం. ఇది లోపించినప్పుడు వేరుశనగ మొక్క ఆకులు పసుపు రంగుకు మారతాయి. క్రమంగా ఆకు కొనలు ఎండిపోతాయి. మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఈ సమస్య నివారణకు 0.5 శాతంఅన్నబేధి(5గ్రా. లీటరు నీటికి), 0.1 శాతం నిమ్మఉప్పు(లీటరు నీటికి 1గ్రాము) కలిపిన ద్రావణాన్ని 4-5 రోజుల వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేసుకోవాలి.
News October 12, 2025
ఏడు వారాల నగలను ఎందుకు ధరించేవారు?

పూర్వం అలంకరణ కోసమే కాక ఆధ్యాత్మిక శక్తి, ఆరోగ్య సంపద కోసం స్త్రీలు ఆభరణాలు ధరించేవారు. నేటి రత్నపు ఉంగరాల మాదిరిగానే, ఒకప్పుడు గ్రహాలను శాంతింపజేయడానికి రోజుకో రకమైన ఆభరణాలను ధరించేవారు. వీటినే ఏడువారాల నగలు అంటారు. ఆయా వారాలకు ఆధిపత్యం వహించే గ్రహాలకి ఆయా రోజుల్లో ప్రీతికరమైన నగలు ధరిస్తే.. సానుకూల శక్తి లభిస్తుందని భావిస్తారు. బంగారం రోజూ శరీర భాగాలను తాకడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుందని నమ్మకం.