News November 23, 2024

మహారాష్ట్రలో MVAను ముంచేసిన కాంగ్రెస్

image

మహారాష్ట్ర ఎన్నికల్లో MVA ఘోర పరాజయంలో కాంగ్రెస్‌దే ఎక్కువ బాధ్యత. ఎందుకంటే 288 స్థానాలున్న ఇక్కడ హస్తం పార్టీ 101 చోట్ల పోటీచేస్తే కేవలం 22 నియోజకవర్గాల్లోనే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. కూటమి గెలవాలంటే ఎక్కువ సీట్లలో పోటీచేసిన పార్టీయే మరిన్ని విజయాలు అందుకోవాలి. అలాంటిది కాంగ్రెస్ స్ట్రైక్‌రేట్ ఇక్కడ 22కే పరిమితమైంది. ఇక శివసేన యూబీటీ 20/95, NCP SP 12/86తో చతికిలపడ్డాయి.

Similar News

News November 23, 2024

ఎదురుదెబ్బలను తట్టుకుని పీఠమెక్కారు

image

ఎగ్జిట్‌పోల్స్, విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ, అనేక ఎదురుదెబ్బలను తట్టుకుని ఝార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని JMM మరోసారి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఏడాదిలో తాను అరెస్టవడం, తర్వాత కీలక నేత చంపై సోరెన్, వదిన సీత కమలం గూటికి చేరినా ఆయన తగ్గలేదు. భార్య కల్పనతో కలిసి సుడిగాలి పర్యటనలు చేశారు. తనపై బీజేపీ చేసిన తీవ్ర ఆరోపణలను ఎండగడుతూనే ప్రజాకర్షక పథకాలతో ఓటర్ల మనసు గెలిచారు.

News November 23, 2024

సిక్సర్లలో జైస్వాల్ రికార్డు

image

టీమ్ ఇండియా బ్యాటింగ్ సెన్సేషన్ యశస్వీ జైస్వాల్ అరుదైన ఫీట్ సాధించారు. టెస్టు ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు (34) కొట్టిన క్రికెటర్‌గా నిలిచారు. 2014లో న్యూజిలాండ్ క్రికెటర్ మెక్కల్లమ్ 33 సిక్సర్లు బాదారు. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో జైస్వాల్ 2 సిక్సర్లు కొట్టి మెక్కల్లమ్ రికార్డును బద్దలు కొట్టారు.

News November 23, 2024

56లక్షల ఫాలోవర్లున్న నటుడు.. వచ్చిన ఓట్లు 146

image

సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో గెలిచేస్తామనుకోవడం భ్రమేనని మరోసారి రుజువైంది. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, యాక్టర్ అజాజ్ ఖాన్‌‌కు ఇన్‌స్టాలో 56లక్షల ఫాలోవర్లు ఉన్నారు. బయటా ఫ్యాన్‌బేస్ ఉంది. ఆయన మహారాష్ట్రలోని వెర్సోవాలో ఆజాద్ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేశారు. 20 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఆయనకు కేవలం 146 ఓట్లే వచ్చాయి. విచిత్రంగా నోటాకు ఇక్కడ 874 ఓట్లు పడ్డాయి.