News October 4, 2024
ఆ మ్యాప్‌ను తొలగించిన ఇజ్రాయెల్

జమ్మూకశ్మీర్‌లోని కొంత భాగాన్ని పాకిస్థాన్ భూభాగంగా తప్పుగా చిత్రీకరించిన భారత మ్యాప్‌ను ఇజ్రాయెల్ తొలగించింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఇజ్రాయెల్ తన అధికార వెబ్‌సైట్ నుంచి దాన్ని తొలగించింది. దీనిపై భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడుతూ ‘ఇది వెబ్‌సైట్ ఎడిటర్ పొరపాటు. దీన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. మ్యాప్‌ను తొలగించాం’ అని తెలిపారు.
Similar News
News November 22, 2025
‘స్వయం సహాయక గ్రూపుల్లో కిశోర బాలికలకు అవకాశం’

స్వయం సహాయక గ్రూపుల్లో 15- 18 ఏళ్ల వయసున్న కిశోర బాలికలకు అవకాశం కల్పిస్తామని, 60 ఏళ్లు దాటిన మహిళలకూ సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తామని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. బోయినిపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో కొత్తగా 5,560 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో చేరారని వివరించారు.
News November 22, 2025
సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి: ముర్ము

AP: విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని పేర్కొన్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని తెలిపారు. ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని, ఆయన సందేశంతో అనేక మందిని సేవామార్గంలో నడిపించారన్నారు.
News November 22, 2025
తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయం

ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 205 రన్స్ టార్గెట్‌ను ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ENG బౌలర్లను ఓపెనర్ హెడ్ ఊచకోత కోశారు. కేవలం 83 బంతుల్లోనే 123 రన్స్ బాదారు. లబుషేన్ 51* రన్స్‌తో రాణించారు.
స్కోర్స్: ENG- 172, 164.. AUS- 132, 205/2


