News April 3, 2024
వీరికి సాయం చేయడం తృప్తి కలిగించింది: సీఎం రేవంత్

TG: గతంలో దుండగుల కాల్పుల్లో అకాలమరణం చెందిన జవాన్ యాదయ్య కుటుంబానికి సాయం అందించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. ‘నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డి పల్లెకు చెందిన యాదయ్య కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఐదెకరాల భూమి, ఆయన భార్య సునితమ్మకు ఉద్యోగం కల్పించడం జరిగింది. ఈ విధంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగిందన్న తృప్తి కలిగింది’ అని తన ట్వీట్లో పేర్కొన్నారు.
Similar News
News March 28, 2026
బాలకృష్ణ సినిమాలో డింపుల్ హయాతి!

బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో డింపుల్ హయాతి నటించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. నయనతార లీడ్ రోల్లో నటిస్తుండగా, డింపుల్ సెకండ్ హీరోయిన్గా ఎంపికైనట్లు పేర్కొన్నాయి. ముంబై బ్యాక్ డ్రాప్తో సాగే ఈ మాస్ మూవీలో బాలకృష్ణ గ్యాంగ్స్టర్ తరహా పాత్రలో కనిపించనున్నట్లు చెప్పాయి. గోపి-బాలయ్య కాంబోలో తొలి మూవీ వీరసింహారెడ్డి కాగా ఇది రెండోది. వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు.
News March 28, 2026
వేసవిలో హాయిగా నిద్రపట్టాలంటే?

పడుకునే ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. కాటన్ బెడ్ షీట్స్ వాడితే చల్లగా ఉంటాయి. రాత్రి మసాలాలు ఎక్కువగా ఉండే భోజనం తినొద్దు. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. పడుకునే గంట ముందు గ్లాస్ మజ్జిగ లేదా గోరువెచ్చని పాలు తాగితే శరీరం చల్లబడుతుంది. సాయంత్రం తర్వాత టీ, కాఫీ దూరం పెట్టాలి. పడుకునే ముందు నీరు ఎక్కువగా తాగొద్దు.
News March 28, 2026
ఆ జిల్లాలకు APSDMA బిగ్ అలర్ట్

AP: రాష్ట్రంలోని 35 మండలాల్లో రేపు తీవ్ర వడగాల్పులు, 87 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. SKLM, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, NTR జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్ర ప్రభావం ఉండే ఆస్కారముందని చెప్పింది. రాయలసీమ, సెంట్రల్ ఆంధ్రాలో 40°C-42°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇక ఇవాళ మార్కాపురం(D) బొట్లగూడురులో 42.6°C ఉష్ణోగ్రత రికార్డ్ అయినట్లు పేర్కొంది.


