News April 3, 2024

‘ఇంటింటికీ గ్యారంటీ’ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్

image

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాన్ని విస్తృతం చేసేందుకు కాంగ్రెస్ ‘ఘర్ ఘర్ గ్యారంటీ’ (ఇంటింటికీ గ్యారంటీ) కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. దేశంలోని 8కోట్ల కుటుంబాలకు భారత్ జోడో యాత్ర సమయంలో ప్రకటించిన పాంచ్ న్యాయ్, 25 గ్యారంటీలపై అవగాహన కల్పించనుంది. యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్ పేరుతో ‘పాంచ్ న్యాయ్’ లక్ష్యంగా పనిచేస్తామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.

Similar News

News December 24, 2025

జగన్‌కు జ్వరం.. కార్యక్రమాలు రద్దు: వైసీపీ

image

AP: మాజీ సీఎం, తమ పార్టీ అధినేత YS జగన్ అస్వస్థతకు గురైనట్లు వైసీపీ ట్వీట్ చేసింది. ‘జగన్ జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్ల సూచన మేరకు పులివెందుల పర్యటనలో ఇవాళ్టి కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు’ అని తెలిపింది.

News December 24, 2025

ఇండియన్ స్పేస్ సెక్టార్‌లో ఇది కీలక ముందడుగు: PM మోదీ

image

LVM3-M6 <<18655479>>మిషన్‌ను<<>> సక్సెస్ చేసిన ఇస్రోను PM మోదీ అభినందించారు. ‘ఇండియన్ స్పేస్ సెక్టార్‌లో ఇది కీలక ముందడుగు. గ్లోబల్ కమర్షియల్ లాంచ్ మార్కెట్‌లో మన పాత్రను బలోపేతం చేస్తుంది. గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్స్, కమర్షియల్ లాంచ్ సర్వీసుల విస్తరణ రాబోయే గగన్‌యాన్ వంటి మిషన్లకు బలమైన ఫౌండేషన్‌గా మారుతుంది. యువ శక్తితో మన స్పేస్ ప్రోగ్రామ్ డెవలప్ అవడంతో పాటు ఎఫెక్టివ్ అవుతోంది’ అని ట్వీట్ చేశారు.

News December 24, 2025

BELలో అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<>BEL<<>>) ఘజియాబాద్‌లో 84 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీటెక్, BE ఉత్తీర్ణులైన వారు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు స్టైపెండ్ రూ.17,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in