News July 13, 2024
ఆ వర్సిటీలో 94 ఏళ్లలో తొలిసారిగా మాంసాహారం

కేరళలోని కళామండలం యూనివర్సిటీలో 94 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా క్యాంటీన్లో మాంసాహారాన్ని యాజమాన్యం ఏర్పాటు చేసింది. సంస్థ మొదలైనప్పటి నుంచి శాకాహారమే ఇక్కడ అందుబాటులో ఉండేది. నాన్ వెజ్ కోసం విద్యార్థులు డిమాండ్ చేస్తుండటంతో తాజాగా చికెన్ బిర్యానీ ఏర్పాటు చేసింది. దాన్ని త్రిస్సూర్‌లోని వియ్యూర్ జైలు ఖైదీలు తయారుచేయడం విశేషం. 1930లో ప్రారంభమైన కళామండలం గురుకుల వ్యవస్థలో నడుస్తోంది.
Similar News
News December 8, 2025
ఉప సర్పంచ్ పదవికి డిమాండ్!

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచ్ పదవికి డిమాండ్ ఏర్పడింది. సర్పంచ్‌తో పాటు జాయింట్ చెక్ పవర్ ఉండటమే దీనికి కారణం. రిజర్వేషన్లు కలిసిరానిచోట వార్డు మెంబర్‌గా గెలిచి ఉప సర్పంచ్ అవ్వాలని పోటీ పడుతున్నారు. దీనికోసం రూ.లక్షల్లో ఖర్చుకు వెనుకాడట్లేదు. ఎస్సీ, ఎస్టీతో జనరల్ రిజర్వేషన్ ఉన్న స్థానాల్లోనూ పోటీ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అటు ఇతర వార్డు మెంబర్ల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
News December 8, 2025
పచ్చిరొట్టగా పెసర/మినుముతో లాభాలు

ఒక ఎకరం పొలంలో 6-8 కిలోల పెసర/మినుము విత్తనాలు చల్లాలి. పూత దశకు వచ్చాక మొదళ్లు, కొమ్మలు, ఆకులను భూమిలో కలియదున్నాలి. దీని వల్ల 8 టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. అలాగే 24KGల నత్రజని, 5KGల భాస్వరం, 6KGల పొటాష్, ఇతర పోషకాలు భూమికి అందుతాయి. ఈ పచ్చిరొట్ట ఎరువు భూమిలో మొక్కల వేర్ల ద్వారా నత్రజనిని ఎక్కువగా స్థిరీకరిస్తుంది. దీని వల్ల పంటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడి పొందవచ్చు.
News December 8, 2025
‘అఖండ-2’ విడుదలపై క్లారిటీ అప్పుడే?

‘అఖండ-2’ను ఈ నెల 12న విడుదల చేయాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అయితే డిసెంబర్ 25కు రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. 12న విడుదలైతే వచ్చే వారంలో ‘అవతార్-3’ రిలీజ్ ఉండటంతో కలెక్షన్లపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈరోస్ సంస్థతో వివాదం విషయమై రేపు క్లారిటీ రానుందని, ఆ తర్వాతే రిలీజ్ డేట్‌పై ప్రకటన వస్తుందని వెల్లడించాయి.


