News October 26, 2024

సోదరుడిని స్వయంగా పోలీసులకు అప్పగించిన మాజీ మంత్రి

image

TG: ఓ కేసులో నిందితుడిగా ఉన్న తన సోదరుడు శ్రీకాంత్ గౌడ్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా పోలీసులకు అప్పగించారు. MBNR జిల్లా ఆదర్శ్‌నగర్‌లోని ప్రభుత్వ భూములు, డబుల్ బెడ్రూం ఇళ్లను తప్పుడు పత్రాలు సృష్టించి విక్రయించారని నలుగురిపై కేసు నమోదైంది. వారిలో ఉన్న శ్రీకాంత్ గౌడ్‌ పరారీలో ఉండగా పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలోనే నిన్న ఆయనను శ్రీనివాస్ గౌడ్ కారులో తీసుకొచ్చి PSలో అప్పగించారు.

Similar News

News January 8, 2026

10pmకు రాజాసాబ్ ప్రీమియర్ షో.. అయితే!

image

TG: ప్రభాస్ ‘రాజాసాబ్’ ప్రీమియర్స్‌పై ఫ్యాన్స్‌కు నిరాశ తప్పేలా లేదు. ప్రీమియర్స్, టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అనుమతి రాలేదు. దీంతో హైదరాబాద్‌లో ఓ ప్రీమియర్ షో వేయాలని మేకర్స్ నిర్ణయించారు. రాత్రి 10 గంటలకు బాలానగర్ విమల్ థియేటర్‌లో షో వేయనున్నారు. దీనికి కేవలం మీడియా ప్రతినిధులనే అనుమతిస్తున్నారు. అటు ఏపీలో మాత్రం ప్రీమియర్ షోలు ప్రారంభం అవుతున్నాయి.

News January 8, 2026

ACB కేసుల్లో ద‌ర్యాప్తు జ‌ర‌గాల్సిందే: సుప్రీంకోర్టు

image

AP: ACB న‌మోదు చేసిన FIRలను ర‌ద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ACB సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్(CIU)-విజయవాడ ఫైల్ చేసిన అన్ని FIRల‌పై ద‌ర్యాప్తు చేయాలని ఆదేశించింది. 6నెల‌ల్లో తుది నివేదిక ఇవ్వాలని, ప్ర‌తివాదుల‌ను అరెస్ట్ చేయొద్దని సూచించింది. ACB CIUకు నోటిఫైడ్ పోలీస్ స్టేష‌న్ హోదా లేద‌నే కారణంతో FIRల‌ను హైకోర్టు గతంలో కొట్టేసింది. దీన్ని SCలో ACB సవాలు చేసింది.

News January 8, 2026

అమరావతిపై జగన్ వ్యాఖ్యలు.. మంత్రుల దండయాత్ర

image

AP: జగన్ అమరావతిపై చేసిన <<18799615>>కామెంట్స్<<>> రాష్ట్రంలో ముందుగానే భోగి మంటలు రాజేశాయి. మంత్రులు ఒక్కొక్కరుగా కౌంటర్ అటాక్‌కు దిగారు. ఇటీవల YCP చేసిన ఏ ఆరోపణల మీదా ఇలా వెంటనే ఎదురుదాడి చేయలేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాష్ట్రానికి కీలకమైన అంశం, రూ.వందల కోట్ల మేర పనులు జరుగుతున్న ప్రాంతంపై ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్లొద్దనే ఇలా రియాక్ట్ అయినట్లు టాక్.