News May 24, 2024
రాహుల్ను చిక్కుల్లోకి నెట్టిన లాంగర్

భారత హెడ్కోచ్ పదవిపై జస్టిన్ లాంగర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘భారత కోచ్ బాధ్యతలు ఎలా ఉంటాయన్న విషయంపై KL రాహుల్తో చర్చించా. IPL కంటే వేల రెట్లు ఒత్తిడి, రాజకీయాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. అందుకే హెడ్ కోచ్ పదవికి పోటీ నుంచి తప్పుకున్నా’ అంటూ లాంగర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రాహుల్కు అలా ఎందుకు అనిపించింది? నిజంగా లాంగర్కు చెప్పారా? అన్నది క్రీడా వర్గాల్లో సంచలనంగా మారింది.
Similar News
News December 6, 2025
విమాన సర్వీసుల ఆలస్యంతో ప్రయాణికుల అవస్థలు

రాజమహేంద్రవరం (మధురపూడి) విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు కావడం, ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు ఇబ్బందులను చవి చూస్తున్నారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లాల్సిన విమాన సర్వీసులను, హైదరాబాద్ వెళ్లే రెండు సర్వీస్లను ఇండిగో సంస్థ రద్దు చేసింది. బెంగళూరు వెళ్లాల్సిన విమానం 7.15 గంటలకు రావాల్సి ఉండగా శుక్రవారంరాత్రి 11 గంటలకు వస్తుందని ప్రకటించారు. ముంబై వెళ్లే విమానాలు సైతం బాగా ఆలస్యంగా నడిచాయి.
News December 6, 2025
రబీ నువ్వుల సాగు.. నేలలు, నాటే సమయం

మురుగునీటి పారుదల బాగా ఉన్న నల్లరేగడి లేదా తేలిక నేలలు నువ్వుల పంట సాగుకు అనుకూలం. ఆమ్ల, క్షార గుణాలు కలిగిన నేలలు ఈ పంట సాగుకు పనికిరావు. తగినంత తేమ నిలుపుకొనే ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు మరింత అనువైనవి. కోస్తా జిల్లాల్లో రబీలో/రబీ వేసవి పంటగా డిసెంబర్ రెండో పక్షం నుంచి జనవరి నెలాఖరు వరకు నువ్వులను విత్తుకోవచ్చు. విత్తుట ఆలస్యమైతే పంటకు వెర్రి తెగులు ఆశించి దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
News December 6, 2025
ఇండిగో సంక్షోభం: CJI జోక్యం చేసుకోవాలని పిల్

ఇండిగో సంక్షోభంపై CJI జోక్యం చేసుకోవాలని కోరుతూ పిల్ దాఖలైంది. విమానయాన శాఖ, DGCA నుంచి స్టేటస్ రిపోర్టు తీసుకోవాలని, తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో అత్యవసర విచారణ కోసం పిటిషనర్ న్యాయవాదిని తన నివాసానికి పిలిపించి CJI మాట్లాడనున్నారని సమాచారం. మరోవైపు ఇండిగో సర్వీసులపై సమాచారం తెలుసుకుని రావాలని ప్రయాణికులను బెంగళూరు ఎయిర్పోర్టు కోరింది.


