News January 7, 2025
అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే: BJP

కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. DyCM DK శివకుమార్ లేకుండా CM సిద్దరామయ్య అతిథిగా మంత్రుల మీటింగ్స్ జరుగుతున్నాయి. JAN 2, నిన్న రాత్రి మీటింగ్స్ జరగడంతో కాంగ్రెస్లో విభేదాలు మొదలయ్యాయని BJP విమర్శించింది. నిన్న జరిగింది సిద్దూ ఫేర్వెల్ మీటింగని ఆరోపించింది. ఒకరికి ఒకే పదవి విధానాన్ని సిద్దూ హైకమాండ్ వద్ద ప్రతిపాదించడంతో DKను PCC చీఫ్గా నియమిస్తారని వార్తలు రావడం తెలిసిందే.
Similar News
News December 9, 2025
పాకిస్థాన్కు మరిన్ని నిధులు ఇచ్చిన IMF

దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) మరోసారి భారీ ఆర్థిక సహాయం అందించింది. తాజాగా 1.2 బిలియన్ డాలర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాక్కు ఇప్పటివరకు వచ్చిన మొత్తం నిధులు సుమారు 3.3B డాలర్లకు చేరాయి. ఆ దేశం గత కొన్నేళ్లుగా ఎక్కువగా బయటనుంచి వచ్చే <<16600466>>ఆర్థిక సాయం<<>>పైనే ఆధారపడుతోంది. 2023లో త్రుటిలో డిఫాల్ట్ను తప్పించుకుంది.
News December 9, 2025
హైదరాబాద్లోని NI-MSMEలో ఉద్యోగాలు..

HYDలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్ప్రైజెస్(NI-<
News December 9, 2025
శోకం నుంచి శక్తిగా.. సోనియా ప్రస్థానం!

నేడు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు. భర్త రాజీవ్ గాంధీ మరణంతో పార్టీ పగ్గాలు చేపట్టి పురుషుల ఆధిపత్యం ఉన్న రాజకీయాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న పార్టీని అకుంఠిత దీక్షతో మళ్లీ అధికారంలోకి తెచ్చారు. పాలనలో తనదైన ముద్ర వేసి సుదీర్ఘకాలం దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. 2009లో ఇదే రోజున తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ ఆమె రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించారు.


