News March 4, 2025
ఇక ఈమెయిల్స్, ఆన్లైన్, SM అకౌంట్లను తనిఖీ చేయనున్న IT

పన్ను ఎగ్గొడుతున్నారని డౌటొస్తే చాలు 2026, APR 1 నుంచి IT అధికారులు మీ కంప్యూటర్లు, ఈమెయిల్స్, SM, బ్యాంకు, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ సహా అన్ని రకాల డిజిటల్ అకౌంట్లను తనిఖీ చేయడం ఖాయం. వెల్లడించని ఆదాయం, బంగారం, నగలు, విలువైన వస్తువులు, ప్రాపర్టీ ఉన్నాయని భావిస్తే ఇలా చేస్తారు. గతంలో ఇళ్లు, బీరువా, లాకర్ తాళాలను పగలగొట్టేందుకే అధికారం ఉండేది. కొత్త IT చట్టంలో పైవాటినీ అనుమతించారు.
Similar News
News December 5, 2025
ప్రజలు జాగ్రత్తలు పాటించండి: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్న సందర్భంగా ప్రజలు అత్యంత జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ వ్యాధి చిగర్ మైట్స్ అనే సూక్ష్మ పురుగుల కాటుతో వ్యాపిస్తుందని, ప్రారంభ దశలోనే వైద్య చికిత్స పొందితే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రారంభదశలో గుర్తిస్తే సులభంగా నయం చేసుకోవచ్చన్నారు.
News December 5, 2025
చలికాలం.. నిండా దుప్పటి కప్పుకుంటున్నారా?

చలికాలం కావడంతో కొందరు తల నుంచి కాళ్ల వరకు ఫుల్గా దుప్పటిని కప్పుకొని పడుకుంటారు. ఇలా చేస్తే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందక రక్తప్రసరణ తగ్గి గుండెపై ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ కూడా మందగిస్తుందట. ‘దుప్పటి ముఖానికి అడ్డుగా ఉంటే CO2 లెవల్స్ పెరిగి మెదడు పనితీరుపై ఎఫెక్ట్ చూపుతుంది. O2, Co2 మార్పిడికి అడ్డంకి ఏర్పడి శ్వాసకోస సమస్యలొస్తాయి’ అని చెబుతున్నారు.
News December 5, 2025
పాక్ తొలి CDFగా ఆసిమ్ మునీర్ నియామకం

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్గా ఉన్న ఆసిమ్ మునీర్ను ఆ దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF)గా నియమిస్తూ అధ్యక్ష కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఆర్మీ స్టాఫ్ చీఫ్ పదవితో పాటు CDFగానూ ఐదేళ్ల పాటు కొనసాగుతారని చెప్పింది. అలాగే ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది. వీరిద్దరికి అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ శుభాకాంక్షలు తెలిపినట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.


